TS ICET 2023 Answer Key Date: జూన్ మొదటి వారంలోనే తెలంగాణ ఐసెట్ అధికారిక ఆన్సర్ కీ విడుదల

Rudra Veni

Published On:

కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల షెడ్యూల్‌తో పాటు అధికారిక TS ICET ప్రొవిజనల్ ఆన్సర్ కీ తేదీ 2023ని (TS ICET 2023 Answer Key Date) ప్రకటించింది. ఆన్సర్ కీతో కూడిన TS ICET 2023 రెస్పాన్స్ షీట్ ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి. 
TS ICET Provisional Answer Key Date 2023TS ICET Provisional Answer Key Date 2023

TS ICET ప్రొవిజనల్ ఆన్సర్ కీ తేదీ 2023 (TS ICET 2023 Answer Key Date): కాకతీయ విశ్వవిద్యాలయం TS ICET 2023 పరీక్షను మే 26, 27, 2023న నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరయ్యే వారు ఆన్సర్ కీని (TS ICET 2023 Answer Key Date) ఎప్పుడు విడుదల చేస్తారో ఈ పేజీలో తెలుసుకోవచ్చు. పరీక్ష షెడ్యూల్ ప్రకటనతో పాటు ఆన్సర్ కీ విడుదల కోసం నిర్వహించే అధికారం తేదీ ప్రకటించింది. దాని ప్రకారం అధికారిక ప్రొవిజనల్ TS ICET ఆన్సర్ కీ 2023 జూన్‌లో విడుదల చేయబడుతుంది. పరీక్షకు హాజరైనవారు అధికారిక వెబ్‌సైట్‌లో icet.tsche.ac.in చూడొచ్చు.

ఆన్సర్ కీతోపాటు TS ICET 2023 రెస్పాన్స్ షీట్ ‌ కూడా విడుదల అవుతుంది. రెస్పాన్స్ షీట్‌లో అభ్యర్థి వారి పరీక్షలో గుర్తించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. రెస్పాన్స్ షీట్‌ను ఫలితాలను తెలుసుకోవడానికి ఉపయోగించబడతాయి. ఏదైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేందుకు ఒక విండో కూడా అందించబడుతుంది.

TS ICET ప్రొవిజనల్ ఆన్సర్ కీ తేదీ 2023 (TS ICET Provisional Answer Key Date 2023)

TS ICET కోసం రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ తేదీ ఈ దిగువున ఇవ్వబడ్డాయి.

ఈవెంట్స్ తేదీలు
పరీక్ష తేదీ మే 26, 27, 2023
రెస్పాన్స్ షీట్ విడుదల జూన్ 5, 2023
ఆన్సర్ కీ విడుదల జూన్ 5, 2023

ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ ఒకే పత్రంగా విడుదల చేయబడతాయి. రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు పోర్టల్‌ని సందర్శించి హోంపేజీలో అందించిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. లింక్‌పై క్లిక్ చేసి కొత్త పేజీలో మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. మీ రెస్పాన్స్ షీట్‌ని చెక్ చేయడానికి వివరాలని సబ్మిట్ చేయాలి. మీరు షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ సమాధానాలను క్రాస్-చెక్ చేయడానికి ఆన్సర్ కీని ఉపయోగించవచ్చు.

TS ICET 2023 సంబంధిత లింకులు (TS ICET 2023 Related Links)

TS ICET 2023కి సంబంధించి మీకు సహాయపడే ఇతర ముఖ్యమైన లింక్‌లను ఈ దిగువన ఉన్న టేబుల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు:

ప్రశ్నాపత్రం టీఎస్‌ ఐసెట్‌ క్వెషన్‌ పేపర్‌ 2023
అధికారిక ఫలితం తేదీ టీఎస్‌ ఐసెట్‌ రిజల్ట్‌ డేట్‌ 2023

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com .

/news/ts-icet-provisional-answer-key-date-2023-41057/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top