TS PGECET 2023 Results Date: రేపే తెలంగాణ పీజీఈసెట్ 2023 ఫలితాలు విడుదల

Andaluri Veni

Updated On: June 07, 2023 06:29 pm IST

తెలంగాణ పీజీఈసెట్ 2023 ఫలితాలు (TS PGECET 2023 Results Date) రేపు విడుదలకానున్నాయి. అధికారులు ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో? ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. 
TS PGECET 2023 Results Date: రేపే తెలంగాణ పీజీఈసెట్ 2023 ఫలితాలు విడుదలTS PGECET 2023 Results Date: రేపే తెలంగాణ పీజీఈసెట్ 2023 ఫలితాలు విడుదల

తెలంగాణ పీజీఈసెట్ 2023 ఫలితాల విడుదల తేదీ (TS PGECET 2023 Results Date): తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS PGECET 2023 Results Date) ఫలితాలు రేపు (జూన్ 08, 2023) విడుదల కానున్నాయి. TS PGECET 2023 ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేస్తారు. 2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైమ్ ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం TS PGECET 2023ని నిర్వహిస్తారు. 

ప్రతి ఏడాది JTNU, హైదరాబాద్ TS PGECETని నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది కూడా మే 29 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరిగింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS PGECET 2023 ఫలితాలను https://pgecet.tsche.ac.in/లో విడుదల చేస్తుంది.

TS PGECET 2023 ఫలితాన్ని చెక్ చేసుకునే విధానం (Steps to Check TS PGECET 2023 Result)

TS PGECET 2023 ఫలితాన్ని చెక్ చేడానికి అభ్యర్థులు ఈ కింది దశలను ఫాలో అవ్వొచ్చు
  • అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.inresult లింక్‌ని సందర్శించండి
  • హోంపేజీలో TS PGECET ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి
  • హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయండి
  • లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి
  • TS PGECET ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • అనంతరం ఆ PDFని డౌన్‌లోడ్ చేసుకోండి
అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం TS PGECET ర్యాంక్ కార్డ్  ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. అలాగే కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసి అడ్మిషన్ పూర్తయ్యే వరకు ర్యాంక్ కార్డును భద్రంగా ఉంచండి.


TS PGECET ఫలితాలు, ముఖ్యమైన సూచనలు (TS PGECET Result 2023: Important Instructions)

అభ్యర్థులు TS PGECET 2023 ఫలితానికి సంబంధించిన ఈ కింది సూచనలను ఇక్కడ కింది విభాగంలో చూడొచ్చు.
  • TS PGECET 2023 ఫలితాలు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది
  • TS PGECET 2023 ఫలితాలు ఆధారంగా అధికారం మెరిట్ జాబితాను సిద్ధం చేస్తుంది
  • ఫలితాలుతో అధికారం విద్యార్థులకు ర్యాంక్ కార్డును పబ్లిష్ చేస్తుంది. 

TS PGECET 2023 ఫలితాల్లో ఉండే వివరాలు (What Details are mentioned in the TS PGECET 2023 Result?)

TS PGECET 2023 స్కోర్ కార్డులో ఉండే వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • ర్యాంక్ 
  • వచ్చిన మార్కులు
  • TS PGECET 2023 పర్సంటైల్ 
  • పరీక్ష అర్హత స్థితి
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-pgecet-2023-results-will-be-released-tomorrow-41638/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!