Srikakulam Anganwadi Jobs: మహిళలకు ఉద్యోగాలు, పదో తరగతి అర్హత ఉంటే చాలు, రేపే లాస్ట్ డేట్

Andaluri Veni

Updated On: May 24, 2023 03:36 pm IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాల (Srikakulam Anganwadi Jobs)  భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళలకు అర్హులు. 
Srikakulam Anganwadi Jobs: మహిళలకు ఉద్యోగాలు, పదో తరగతి అర్హత ఉంటే చాలు, రేపే లాస్ట్ డేట్Srikakulam Anganwadi Jobs: మహిళలకు ఉద్యోగాలు, పదో తరగతి అర్హత ఉంటే చాలు, రేపే లాస్ట్ డేట్

శ్రీకాకుళం అంగన్‌వాడీ ఉద్యోగాలు (Srikakulam Anganwadi Jobs): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల పోస్టుల (Srikakulam Anganwadi Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 123 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు గమనించవచ్చు. ఈ దిగువున డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

శ్రీకాకుళం అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్- డైరక్ట్ లింక్

మొత్తం అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య  (Total Number of  Anganwadi Worker and Helper Posts)

శ్రీకాకుళలంలో అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య గురించి ఇక్కడ తెలుసుకోండి. 
పోస్టుల వివరాలుఅంగన్‌వాడి వర్కర్, హెల్పర్
మొత్తం పోస్టుల సంఖ్య 123
జాబ్ లోకేషన్శ్రీకాకుళం
అప్లికేషన్ మోడ్ఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్srikakulam.ap.gov.in

శ్రీకాకుళం అంగన్‌వాడీ వర్కర్ ఖాళీల వివరాలు (WCD Srikakulam Vacancy Deatails)

శ్రీకాకుళం అంగన్‌వాడీ వర్కర్ల ఖాళీల వివరాలు ఈ దిగువున అందజేశాం. 

అంగన్‌వాడీ కార్యకర్త20
అంగన్‌వాడీ సహాయకురాలు93
మినీ అంగన్‌వాడీ వర్కర్ 10


శ్రీకాకుళం అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Required Qualifications for Srikakulam Anganwadi Jobs)

అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి. 
  • స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
  • కచ్చితంగా వివాహితై ఉండాలి
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • మహిళా, శిశు అభివృద్ధి శ్రీకాకుళం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థికి 01-07-2022 నాటికి కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు మహిళలు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మే 25, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  అంగన్‌వాడీ పోస్టులకు  ఎంపికైన  అభ్యర్థులకు మంచి జీతం అందజేయడం జరుగుతుంది. అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు.  

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/wcd-srikakulam-recruitment-2023-40927/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!