ఏపీ ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు, బుక్‌లెట్ పేజీల పెంపు
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్‌లోనే కాదు.. పరీక్షా విధానంలో కూడా చిన్న చిన్న మార్పులు చేశారు. ఇందులో భాగంగా పరీక్షల్లో విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
AP ఇంటర్ 2026 పరీక్షలు (AP Inter 2026 Exams) :ఏపీ ఇంటర్మీడియట్ 2026 పరీక్షలు 23వ తేదీ నుంచి జరగనున్నాయి. దీనికోసం విద్యార్థులు ప్రిపరేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ సిలబస్‌తో పాటు ప్రశ్నపత్రాల విధానంలో కూడా అధికారులు మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు కేవలం 32 పేజీల బుక్‌లెట్ మాత్రమే ఇస్తారు. ఇక అదనంగా ఎలాంటి పేపర్లు ఇవ్వరు. విద్యార్థులు ఆ 32 పేజీల బుక్‌లెట్‌లో మాత్రమే తమ సమాధానాలను రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇచ్చేవారు. ఫస్ట్ ఇయర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్యం పెరగడంతో బుక్‌లెట్‌లో కూడా పేజీలు పెంచడం జరిగింది. ఛాయిస్ లేకుండా పూర్తిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాసినా 28 పేజీలు సరిపోతాయనని, అందుకే 32 పేజీల బుక్‌లెట్ తీసుకొచ్చినట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి పేర్కొంది. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం పాత విధానంలో అంటే 24 పేజీల బుక్‌లెట్ మాత్రమే ఇస్తారు.
ఈ సంవత్సరం మొదటి సంవత్సరం వారికి ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. రెండో సంవత్సరం ప్రశ్నపత్రాల్లో ఎలాంటి ఛేంజ్ ఉండదు. ఆర్థిక శాస్త్రం, హిస్టరీ, సివిక్స్ సబ్జెక్టుల మార్కుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా ప్రశ్నల సంఖ్య పెరగడంతో వీటికి మొత్తం 32 పేజీల బుక్‌లెట్ ఇస్తారు.29 మార్కులొస్తే చాలు.. పాస్
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుకలు మొదటి ఏడాదిలో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 35 శాతం మార్కులొస్తే పాసైనట్టు.. ఆ లెక్కన 29.75 మార్కులు రావాల్సి ఉండగా.. 29 మార్కులు వచ్చినా పాసైనట్టు పరిగణిస్తారు.
ఇక ఇంటర్ రెండో సంవత్సరాలకు కలిపి 35 శాతం కింద 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా.. 59 మార్కులకు పాసైనట్టు నిర్ణయించారు. ఈ అర్థ మార్కును సర్దుదబాటు చేసి, రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ 30 పాస్ మార్కులను 10.5 నుంచి 11కు పెంచారు.
- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నిపరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కోజిల్లాను ఒక్కో అధికారి పర్యవేక్షిస్తారు.
ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోస అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.