10వ తరగతి ప్రశ్నాపత్రాలు మారాయి, ప్రశ్నల్లో ఇవే మార్పులు
ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాల్లో (AP 10th Class Question Papers 2026 Changes) మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి పరాఖ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. త్వరలో మోడల్ ప్రశ్నా పత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
AP 10వ తరగతి ప్రశ్న పత్రాలు 2026 మార్పులు (AP 10th Class Question Papers 2026 Changes) :
ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు జరిగాయి. ఈ మార్పులు ప్రకారం పరీక్ష సరళి, ప్రశ్నల విధానం మారింది. ఇప్పటి వరకు ప్రశ్నల విషయంలో అకడమిక్ ప్రమాణాలను అనుసరించగా.. ఇకపై పరాఖ్ విధానంలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మేరకు AP పరీక్షల డైరక్టర్ మార్చి-2026 కోసం 10వ తరగతి మోడల్ పేపర్లు (AP 10th Class Question Papers 2026 Changes)
, బ్లూప్రింట్‌ను విడుదల చేశారు. కొత్త విద్యా విధానం ప్రకారం సమగ్ర అభివృద్ధి కోసం నాలెడ్జ్, పరితీరు అంచనా, సమీక్ష, విశ్లేషణ ఆధారంగా ఈ ప్రశ్నపత్రాలు రూపొందించడం జరిగింది.
కొత్తగా రూపొందించిన ప్రశ్నాపత్రాల డిజైన్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకు ముందులాగానే ఒక్క మార్కు ప్రశ్నలు 12, రెండు మార్కుల ప్రశ్నలు 5, నాలుగు మార్కుల ప్రశ్నలు 8, 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు. కాకపోతే భాషేతర సబ్జెక్టుల్లో నాలెడ్జ్‌కి, అన్వయానికి 20 శాతం చొప్పున, మూల్యాంకనానికి , క్రియెటివిటీకి 10 శాతం, అవగాహనకి 25 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఇక భాషా సబ్జెక్టులకు అవగాహన-ప్రతిస్పందనకు 24 శాతం, వ్యక్తీకరణ-సృజనాత్మకతకు 44 శాతం, భాషాంశాలకు 32 శాతం వెయిటేజీ ఇస్తారు. దీనిపై విద్యార్థులకు మరింత అవగాహన రావడానికి కొత్త బ్లూ ప్రింట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పరీక్ష విభాగం సూచించింది. అయితే ప్రస్తుతానికి సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నాపత్రాలే అందుబాటులో ఉన్నాయి. కొత్త మోడల్ ప్రశ్నాపత్రాలను త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వాటిని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ అందించాం?
ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AP Board SSC Model Sample Papers)
ఏపీ 10వ తరగతి మోడల్ ప్రశ్నాపత్రాలను ఈ దిగువున స్టెప్స్‌ని ఫాలో అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 1: ముందదుగా విద్యార్థులు bse.ap.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2: పేజీ ఎడమ వైపున క్విక్ లింక్స్ విభాగం కింద ఉన్న 'SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 మోడల్ ప్రశ్న పత్రాలు, బ్లూ ప్రింట్లు, వెయిటేజ్ టేబుల్స్ ' పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: సబ్జెక్ట్ వారీగా మోడల్ పేపర్లతో కూడిన టేబుల్ ఒపెన్ అవుతుంది. .
స్టెప్ 4: తదుపరి ఉపయోగం కోసం మీ సబ్జెక్ట్ PDF పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.