AP DSC 2024 Notification: 6100 పోస్టులకు ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆంద్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (AP DSC 2024 Notification)  రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (AP DSC 2024 Notification):ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టీచర్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు అంటే ఫిబ్రవరి 7, 2024న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. సుమారు 6100 పోస్టులకు పూర్తి షెడ్యూల్ ప్రకటించడంజరిగింది. 6100 పో స్టులతో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 SGT ప ోస్టులు ఉన్నాయి.అలాగే 1,264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న ఫైనల్ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 12, 2024 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)

ఏపీ డీఎస్సీ 2024కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందించడం జరిగింది.
ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లుఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీఫిబ్రవరి 07, 2024
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంఫిబ్రవరి 12, 2024
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీతెలియాల్సి ఉంది
రెండు సెషన్లలో AP DSC 2024 పరీక్షలుమార్చి 15 నుంచి మార్చి 30, 2024
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లుమార్చి 05, 2024
AP DSC 2024 ఫైనల్ కీ విడుదలఏప్రిల్ 02, 2024
AP DSC 2024 ఫలితాలుఏప్రిల్ 07, 2024

ఏపీ డీఎస్సీ 2024 అర్హత ప్రమాణాలు (AP DSC 2024 Educational Qualifications)

అభ్యర్థి తప్పనిసరిగా స్పెషల్ ఎడ్యుకేషన్ (Spl. B.Ed)లో గ్రాడ్యుయేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ, ప్రత్యేక విద్యలో కనీసం ఒక సంవత్సరం డిప్లొమాతో B.Ed (జనరల్) కలిగి ఉండాలి.
లేదా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)తో గుర్తింపు పొందిన ప్రత్యేక విద్యలో రెండేళ్ల డిప్లొమాతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, జనరల్ B.Ed డిగ్రీ. లేదా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)తో గుర్తింపు పొందిన ప్రత్యేక విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమాతో బ్యాచిలర్స్ డిగ్రీ, జనరల్ B.Ed డిగ్రీ చేసి ఉండాలి.


AP DSC 2024 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online for AP DSC 2024)

అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తర్వాత అభ్యర్థి పేరు, తండ్రి పేరు, అర్హతలు, వయస్సు, ఫోటోగ్రాఫ్, సంతకం మొదలైన సరైన సమాచారంతో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించాలి. అప్లికేషన్‌లో తప్పులు లేకుండా చూసుకోవాలి లేకపోతే దరఖాస్తు ఫారమ్ తిరస్కరించబడుతుంది.
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.
  • స్టెప్ 2: దరఖాస్తు చేయడానికి ముందు సూచనలను చదవాలి.
  • స్టెప్ 3: మీ ఆధారాలతో లాగిన్ అవ్వాలి.
  • స్టెప్ 4: AP DSC దరఖాస్తు ఫార్మ్‌ను ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలి.
  • స్టెప్ 5: ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ , సంతకం స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
  • స్టెప్ 6: దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • స్టెప్ 7: చివరి తేదీకి ముందు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి.
  • స్టెప్ 8: భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫార్మ్ ప్రింటవుట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs