RIET ఇంజనీరింగ్ కాలేజీ, రాజమండ్రి, CSE బ్రాంచ్‌కు దశ 1లో కేటాయించిన కటాఫ్ ర్యాంక్ ఇవే
రాజమహేంద్రి ఇన్‌స్టిట్యూట్, రాజమండ్రిలో CSE కోర్సు దశ 1 సీట కేటాయింపు విడుదల అయింది.దశ 1 కటాఫ్ ర్యాంకుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
AP EAMCET 2025, RIET ఇంజనీరింగ్ కాలేజీ,CSE దశ-1 సీటు కేటాయింపు విడుదల వివరాలు(AP EAMCET 2025, RIET Engineering College, CSE Phase-1 Seat Allotment Details Released):
AP EAMCET 2025 ద్వారా రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (RIET), రాజమండ్రిలోని CSE (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) కోర్సుకు దశ 1 సీటు కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడత కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ప్రకారం విద్యార్థులకు సీట్లు కేటాయించబడ్డాయి. RIET కాలేజ్‌కి ఉన్న ప్లేస్‌మెంట్ అవకాశాలు వంటి అంశాలపై దృష్టిపెట్టి విద్యార్థులు ఎక్కువగా ఈ కాలేజ్‌ను ఎంచుకుంటున్నారు.ఈ సీటు కేటాయింపుల్లో విద్యార్థుల కేటగిరీ, రిజర్వేషన్లు, లోకల్/నాన్ లోకల్ ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించారు. ప్రస్తుతం సీటు కేటాయింపు ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.దశ 1 కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో, సీటు రాకపోయిన విద్యార్థులు దశ 2 కౌన్సెలింగ్ కోసం సిద్ధంగా ఉండాలి. తదుపరి విడతలో మిగిలిన సీట్లు భర్తీ చేయబడ్డాయి.కాబట్టి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని విద్యార్థులు తదుపరి ప్రక్రియ కోసం రెడీగా ఉండాలి. దశ -1 క్యాటగిరీ ఆధారంగా
కటాఫ్ ర్యాంకుల వివరాలు ఈ క్రింద ఉన్న టేబుల్‌లో ఇవ్వబడ్డాయి.
AP EAMCET 2025, SRM అమరావతి ECE బ్రాంచ్‌కు చివరి కటాఫ్ ర్యాంక్ విడుదల | మోహన్ బాబు యూనివర్శిటీ ECE బ్రాంచ్‌కు ఫేజ్ 1లో కేటాయించిన చివరి ర్యాంక్ ఇవే |
RIET రాజమండ్రి, CSE దశ 1 సీటు కేటయింపు 2025 కటాఫ్ ర్యాంకుల వివరాలు(RIET Rajahmundry, CSE Phase 1 Seat Allotment 2025 కటాఫ్ Rank Details)
ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ ద్వారా విద్యార్థులు తమ కేటగిరీకి అనుగుణంగా చివరి ర్యాంక్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ర్యాంకులు 2025 మొదటి విడత కౌన్సెలింగ్‌లో నమోదైనవే.
కేటగిరి పేరు | చివరి కటాఫ్ ర్యాంక్(కేటాయించిన సీటు వర్గం చివరి ర్యాంక్) |
OC జనరల్ | 99572 |
BC-A జనరల్ | 174999 |
BC-B జనరల్ | 178151 |
BC-C జనరల్ | 154356 |
BC-D జనరల్ | 178607 |
BC-E జనరల్ | 178151 |
SC జనరల్ | 177228 |
ST జనరల్ | 178607 |
EWS జనరల్ | 166557 |
AP EAMCET 2025 ద్వారా రాజమండ్రిలోని రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (RIET)లో CSE సీట్లకు దశ 1 కేటాయింపు పూర్తయ్యింది. సీటు వచ్చిన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లతో కాలేజీకి హాజరుకావాలి. ఇప్పటివరకు సీటు రాని విద్యార్థులు దశ 2 కౌన్సెలింగ్‌కి సిద్ధంగా ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.