AP EAPCET 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 17తో గడువు ముగింపు, లేట్ ఫీతో దరఖాస్తుకు మరో అవకాశం
AP EAPCET 2026 దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 17,2026. ఆలస్య ఫీజు లేకుండా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో అప్లై చేయాలి. గడువు తేదీ మిస్ అయితే లేట్ ఫీతో కూడా అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉంది.లేట్ ఫీతో దరఖాస్తుకు సంబంధించిన పూతి వివరాలు ఇక్కడ చూడండి.
AP EAPCET 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ వివరాలు (AP EAPCET 2026 Registration Last Date Details):ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకి ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరఫున JNTU కాకినాడ నిర్వహిస్తోంది. AP EAPCET 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 4,2026 నుంచి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్ పొందుతున్నారు. ఈసారి కూడా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.
AP EAPCET 2026 దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేచివరి తేదీ మార్చి 17, 2026 గానిర్ణయించబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. గడువు మిస్ అయితే కూడా లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోగలరు. అందుకే పరీక్ష హాజరుకావాలనుకునే అభ్యర్థులు చివరి తేదికి ముందే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
AP EAPCET 2026: లేట్ ఫీతో దరఖాస్తు చేసుకునే తేదీలు ఇవే (AP EAPCET 2026: These are the dates to apply with late fee)
AP EAPCET 2026 ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తు చేయలేకపోయినా విద్యార్థులకు అధికారులు లేట్ ఫీతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. లేట్ ఫీ వివరాలు ఈ కింది పట్టికలో ఉన్నాయి.
దరఖాస్తు చివరి తేదీ | లేట్ ఫీ |
AP EAPCET 2026 రూ.1,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ | మార్చి 21,2026 వరకు |
రూ.2,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ | మార్చి 25,2026 వరకు |
రూ.4,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ | మార్చి 30,2026 వరకు |
రూ.10,000 లేట్ ఫీతో దరఖాస్తు ఫీజు తేదీ | ఏప్రిల్ 03,2026 వరకు |
AP EAPCET 2026: ఎలా దరఖాస్తు చేయాలి? AP EAPCET 2026: How to apply?)
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌గా ఈ క్రింది విధముగా AP EAPCET 2026 అప్లికేషన్ ఫారమ్ సమర్పించవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ఓపెన్ చేయండి
- ముందుగా "Application Fee Payment" ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- తరువాత "Online Application Form" ఓపెన్ చేసి అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
- విద్యార్హతలు, చిరునామా మరియు ఇతర వివరాలు సరిగా నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి
- చివరగా ఫారమ్‌ను పరిశీలించి సబ్మిట్ చేయాలి
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోండి
AP EAPCET 2026: అప్లికేషన్ ఫీజు వివరాలు (AP EAPCET 2026: Application Fee Details)
విద్యార్థుల వర్గం ఆధారంగా AP EAPCET 2026 దరఖాస్తు ఫీజులు ఇలా నిర్ణయించారు. ఫీజు ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
వర్గం (Category) | అప్లికేషన్ ఫీజు |
OC (జనరల్ ) | రూ.800 |
BC | రూ.750 |
SC /ST | రూ.700 |
AP EAPCET 2026కి హాజరుకావాలనుకునే విద్యార్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల చివరి తేదీ మార్చి 17. గడువు మిస్ అయితే కూడా లేట్ ఫీతో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.