AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందా? లేదా?
AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ (AP EAMCET Third Round Counselling 2025) ఉంటుందా? లేదా? అనే దానిపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై పూర్తి వివరణ, వివరాలు ఇక్కడ అందించాం.
AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ (AP EAMCET Third Round Counselling 2025) :
AP EAMCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ 2025 ఇప్పటికే పూర్తైంది. అయితే సీట్లు పొందని అభ్యర్థులు AP EAMCET 2025 AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ (AP EAMCET Third Round Counselling 2025) కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యర్థనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో 3వ విడత కౌన్సెలింగ్ కోసం అందరిలో ఉత్కంఠ నెలకొంది. AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. అయితే విద్యార్థుల కోసం AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది విద్యార్థులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఒక వేళ అధికారులు కసరత్తు చేస్తుంటే AP EAMCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెలలోనే ఉండే అవకాశం కూడా ఉంది.
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా AP EAMCET 2025కి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కాలేజీలో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగినా భారీగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. 30 వేలకుపైగా సీట్లు ఉండిపోయాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల నుంచి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు అభ్యర్థనలు వచ్చాయి.
ఈ క్రమంలో EAPCET కమిటీ సోమవారం ఉన్నత విద్యా మండలిలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ మీటింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. కౌన్సెలింగ్ నిర్వహించే సాఫ్ట్‌వేర్ సంస్థతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం కూడా ఉంది. ఒక మూడో విడత కౌన్సెలింగ్ జరిగితే.. చాలామంది విద్యార్థులకు సీట్లు పొందే ఛాన్స్ ఉంటుంది.
కాగా ఇప్పటికే రెండు విడతల వారీగా AP EAMCET కౌన్సెలింగ్ జరిగింది. కానీ ప్రైవేట్ కాలేజీల్లో 31, 811 సీట్లలో ఎవరూ చేరలేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,126 సీట్లు మిగిలిపోయాయి. నిజానికి ఎంసెట్‌లో లక్షా 84 వేల 24 మంది అర్హత సాధించారు. కానీ వారీలో కన్వీనర్ కోటాలోచేరేందుకు లక్షా 29 వేల 12 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. అందులోనూ లక్షా 28 వేల 71 మంది మాత్రమే అర్హతను పొందారు. కానీ ప్రైవేట్ వర్సిటీలు, కళాశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలిపి కన్వీనర్ కోటా కింద లక్షా 53 వేల 964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొందరి విద్యార్థులకు కోరుకున్న కాలజీల్లో సీట్లు పొందకపోవడంతో సీట్లు మిగిలిపోయినట్టు తెలుస్తుంది.
3వ విడత AP EAMCET కౌన్సెలింగ్ ప్రక్రియ 2025కి ఎవరు అర్హులు?
AP EAMCET ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించడానికి అభ్యర్థులు AP EAMCET పరీక్షలో అర్హత సాధించి ర్యాంక్ పొందాలి.
అభ్యర్థులు 10+2 లేదా దానికి సమానమైన పరీక్షలో పాసై ఉండాలి.
ఇతర కేటగిరీ (జనరల్) అభ్యర్థులు గ్రూప్ సబ్జెక్టులలో కనీసం 45 శాతం మార్కులు (44.5 శాతం అంతకంటే ఎక్కువ) సాధించాలి.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు (BC, SC, ST) గ్రూప్ సబ్జెక్టులలో 40 శాతం మార్కులు (39.5 శాతం అంతకంటే ఎక్కువ) పొందాలి.
అందరూ అభ్యర్థులు 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.