AP ECET 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కి ఈరోజే చివరి తేదీ
AP ECET 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూలై 8. అభ్యర్థులు ecet-sche.aptonline.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గురించి పూర్తి సమాచారం(AP ECET 2025 Counselling Registration Last Date) ఇక్కడ చూడండి.
AP ECET 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు జూలై 8 చివరి తేదీ(AP ECET 2025 Counselling Registration Last Date July 8):
AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 4న ప్రారంభమై, జూలై 8, 2025 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. డిప్లొమా లేదా B.Sc విద్యార్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన ecet-sche.aptonline.in ద్వారా లాగిన్(AP ECET 2025 Counselling Registration Last Date July 8)అవ్వాలి. రిజిస్ట్రేషన్ సమయంలో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. జూలై 9 వరకు ధ్రువీకరణ జరుగుతుంది. జూలై 7 నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రారంభమై, జూలై 10 వరకు కొనసాగుతుంది. ఎంపికల తర్వాత జూలై 13న సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలవుతాయి. విద్యార్థులు సెల్ఫ్-రిపోర్టింగ్ చేసి, జూలై 14 నుంచి 17 లోపు కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ పొందే అవకాశం కలుగుతుంది.
AP ECET కౌన్సెలింగ్ 2025 రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ (AP ECET Counselling 2025 Registration Direct Link)
అభ్యర్థులు AP ECET కౌన్సెలింగ్ 2025 రిజిస్ట్రేషన్ యొక్క ప్రత్యక్ష లింక్‌ను ఈ క్రింది విధంగా తనిఖీ చేయవచ్చు:
AP ECET 2025 ముఖ్యమైన తేదీల వివరాలు(AP ECET 2025 Important Dates Details)
ఈ క్రింద ఇచ్చిన పట్టికలో AP ECET 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు ప్రతి దశను గమనించి నిర్ణీత గడువులోపు(AP ECET 2025 Important Dates Details)పూర్తి చేయాలి.
వివరాలు | తేదీలు |
AP ECET 2025ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ | జూలై 4, 2025 |
AP ECET 2025రిజిస్ట్రేషన్ చివరి తేదీ | జూలై 8, 2025 |
AP ECET 2025 ధ్రువీకరణ / సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు | జూలై 4 నుండి 9, 2025 |
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ తేదీలు | జూలై 7 నుండి 10, 2025 |
ఆప్షన్ మార్పు (Option Editing) తేదీ | జూలై 11, 2025 |
AP ECET 2025 సీటుల కేటాయింపు ఫలితాల తేదీ | జూలై 13, 2025 |
సెల్ఫ్ రిపోర్టింగ్ & కాలేజ్ రిపోర్టింగ్ తేదీలు | జూలై 14 నుండి 17, 2025 |
AP ECET తరగతుల ప్రారంభం తేదీ | జూలై 14, 2025 |
AP ECET 2025 కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే పాటించాల్సిన దశలు ఇవే(Follow the steps to participate in Up Asset 2025 Counseling)
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecet-sche.aptonline.in ద్వారా జూలై 4 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
- హాల్ టికెట్ నంబర్ ,పుట్టిన తేదీ ఉపయోగించి లాగిన్ అయి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి (SC/ST రూ.600, OC/BC: రూ.1200).
- అవసరమైన డాక్యుమెంట్లు (డిప్లొమా, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఆదాయం, కుల, నివాస సర్టిఫికెట్లు మొదలైనవి) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- మీకు ఇష్టమైన కాలేజీలు ,కోర్సులను వెబ్ ఆప్షన్ ఎంట్రీలో ఎంపిక చేయాలి.
-
జూలై 8, 2025లోపు పై ప్రక్రియలన్నీ పూర్తి చేయాలి,లేకపోతే కౌన్సెలింగ్‌లో పాల్గొనలేరు.
AP ECET 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని దశలను అభ్యర్థులు గడువులోపు పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూలై 8గా నిర్ణయించబడినందున, ఆలస్యం చేయకుండా ముందుగానే రిజిస్టర్ అవ్వాలి. అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకుని, అధికారిక షెడ్యూల్ ప్రకారం తదుపరి దశల్లో పాల్గొనాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.