AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 తేదీలు విడుదల, సూచనలు, అడ్మిషన్ ప్రక్రియను ఇక్కడ చూడండి
APSCHE అధికారిక వెబ్‌సైట్‌లో AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 తేదీలను విడుదల చేసింది. AP ECET స్పాట్ అడ్మిషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 తేదీలు విడుదల (AP ECET Spot Admission 2025 Dates Released) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అభ్యర్థుల కోసం వివరణాత్మక మార్గదర్శకాలతో పాటు AP ECET 2025 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం కళాశాలల్లో అంతర్గత స్లైడింగ్ అక్టోబర్ 1, 2025 న జరుగుతుంది. దీని తర్వాత వ్యక్తిగత కాలేజీలు అక్టోబర్ 2, 2025 న తమ ఖాళీ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తాయి. మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అక్టోబర్ 3 నుంచి 5, 2025 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడతాయి. అభ్యర్థులు సూచనలను జాగ్రత్తగా పాటించాలని, పాల్గొనే ముందు వారు అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 తేదీలు (AP ECET Spot Admission 2025 Dates)
అభ్యర్థులు AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 షెడ్యూల్‌ను (AP ECET Spot Admission 2025 Dates Released) ఈ కింది పట్టికలో చూడవచ్చు.
ఈవెంట్లు | తేదీలు |
కళాశాల ద్వారా అంతర్గత స్లైడింగ్ | అక్టోబర్ 1, 2025 |
కళాశాలల ద్వారా నోటిఫికేషన్ జారీ | అక్టోబర్ 2, 2025 |
స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ | అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2025 వరకు |
AP ECET స్పాట్ అడ్మిషన్ 2025: ముఖ్యమైన సూచనలు (AP ECET Spot Admission 2025: Important Instructions)
AP ECET స్పాట్ అడ్మిషన్ 2025 కింద చేరడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల కోసం ఈ దిగువున సూచనలు ఉన్నాయి:
ఇంకా అడ్మిషన్ తీసుకోని అభ్యర్థులు మాత్రమే అర్హులు. అసలు సర్టిఫికెట్లు చూపించకుండా ఎవరినీ స్పాట్ అడ్మిషన్‌కు అనుమతించరు.
ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా AP ECET 2025లో అర్హత సాధించి, చెల్లుబాటు అయ్యే ర్యాంకు ఉన్న అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఆ తర్వాత, కనీసం 45 శాతం మార్కులతో (OC వారికి), 40% మార్కులతో (BC/SC/ST వారికి) డిప్లొమా లేదా B.Sc. ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు.
స్థానిక/స్థానికేతర హోదా నియమాలను పాటించే వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వబడుతుంది.
తల్లిదండ్రుల్లో ఎవరైనా కనీసం 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తుంటే, ఇతర రాష్ట్రంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చు.
ఒక అభ్యర్థి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, AP కాకుండా వేరే బోర్డు నుంచి డిప్లొమా కలిగి ఉంటే, వారు అడ్మిషన్ పొందే ముందు AP SBTET నుంచి సమానత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి.
APECETలో అర్హత సాధించని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా పొందిన అభ్యర్థులను డిగ్రీ స్థాయిలో ECE బ్రాంచ్ లోకి అనుమతించలేరు. ఈ నియమం ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తుంది. అయితే, ఇతర డిప్లొమా స్ట్రీమ్‌ల అభ్యర్థులకు అలాంటి పరిమితులు లేవు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.