ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో 185 డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
వైద్యారోగ్య శాఖలో 185 డాక్టర్ల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.MBBS అర్హతతో వివిధ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో భారీ డాక్టర్ల నియామకాల నోటిఫికేషన్ విడుదల (Notification released for recruitment of large number of doctors in Andhra Pradesh Medical and Health Department): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం ఒకే ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 185 డాక్టర్ల పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ చేయబడతాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాలు, టెలిమెడిసిన్ సేవలు వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఈ రోజు 26, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 10, 2025 వరకు ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఎంపికైన వారికి వేతనాలు, ఒప్పంద కాలం, విధులు వంటి వివరాలను అధికారికంగా త్వరలో తెలియజేయనున్నారు.ప్రభుత్వం ఈ నియామకాలు రాష్ట్ర వైద్య సేవలను అభివృద్ధి చేసి, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపింది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలోపు దరఖాస్తు పూర్తి చేయాలి.
AP రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పోస్టుల వివరాల పట్టిక (AP State Medical and Health Department Post Details Table)
ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేయబోయే ఆరోగ్య విభాగంలో ఖాళీల జాబితా ఈ క్రింద టేబుల్ పట్టికలో ఇచ్చాం చూడండి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | నియామక విభాగం |
సాధారణ వైద్యులు (MBBS) | 155 | పట్టణ ఆరోగ్య కేంద్రాలు |
జనరల్ మెడిసిన్ డాక్టర్లు | 13 | టెలిమెడిసిన్ హబ్ |
గైనకాలజిస్టులు | 3 | పట్టణ ఆరోగ్య కేంద్రాలు |
చిన్నపిల్లల వైద్యులు | 14 | పట్టణ ఆరోగ్య కేంద్రాలు |
మొత్తం పోస్టులు | 185 |
AP రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పోస్టుల ఎంపిక విధానం (AP State Medical and Health Department Posts Selection Process)
AP రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎంపిక పూర్తిగా మెరిట్ ,అర్హతల ఆధారంగా జరుగుతుంది.
- దరఖాస్తుల పరిశీలన
- అర్హత ధ్రువీకరణ
- మెరిట్ జాబితా తయారీ
- ఫైనల్ ఎంపిక జాబితా విడుదల
AP రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దరఖాస్తు దశలు (AP State Medical and Health Department Application Steps)
AP రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
- అవసరమైన వివరాలు నింపండి
- పత్రాలు అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించండి
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ నిరుద్యోగ డాక్టర్లకు మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన తేదీకి ముందే దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.