AP ICET 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ(AP ICET Counselling 2025 Registration Last Date)
AP ICET 2025 కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.పూర్తి సమాచారం(AP ICET Counselling 2025 Registration Last Date)ఇక్కడ చూడండి.
AP ICET 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూలై 14, విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోండి(AP ICET 2025 Counselling Registration Last Date is July 14, Students Register Immediately): AP ICET 2025 మొదటి దశ కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 10న ప్రారంభమై, జూలై 14, 2025 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ icet-sche.aptonline.in ద్వారా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీటు కేటాయింపు వంటి దశలు నిర్వహించబడతాయి. కౌన్సెలింగ్ ఫీజుగా OC/BC అభ్యర్థులకు ₹1,200 ,SC/ST అభ్యర్థులకు ₹600 చెల్లించాలి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, విద్యార్హత పత్రాలు, స్టడీ/క్యాస్ట్ సర్టిఫికెట్‌లతో సహా అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచాలి. సీటు కేటాయించిన తరువాత , విద్యార్థులు సంబంధిత కళాశాలకు వ్యక్తిగతంగా వెళ్లి తరగతులలో హాజరుకావాల్సి ఉంటుంది.చివరి తేదీకి ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
AP ICET 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు(AP ICET 2025 Counselling Important Dates)
AP ICET 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ క్రింద టేబుల్ పట్టికలో ఇచ్చాము చూడండి.
వివరాలు | తేదీలు |
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | జూలై 10, 2025 |
రిజిస్ట్రేషన్ చివరి తేదీ | జూలై 14, 2025 |
సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు | జూలై 11 నుండి 15, 2025 |
వెబ్ ఆప్షన్ ఎంపిక తేదీలు | జూలై 13 నుండి 16, 2025 |
ఆప్షన్ మార్పు తేదీ | జూలై 17, 2025 |
సీటు కేటాయింపు ఫలితం తేదీ | జూలై 19, 2025 |
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు | జూలై 20 నుండి 22, 2025 |
క్లాసుల ప్రారంభం తేదీ | జూలై 21, 2025 |
AP ICET 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన విషయాలు(AP ICET 2025 Counselling Important Topics)
- వెబ్ ఆప్షన్లు ఎంచుకుంటున్నప్పుడు, విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీ & కోర్సుల ప్రాధాన్యతను క్రమబద్ధంగా, స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి.
- గత సంవత్సరం కట్ఆఫ్‌లను రిఫరెన్స్‌గా తీసుకోవాలి.
- కనీసం 20 నుండి 30 ఆప్షన్లు ఎంపిక చేయడం మంచిది.
- ఫేజ్ 1 లో సీటు రాని వారికి ఫేజ్ 2 లో అవకాశం ఉంటుంది.
- చివరి నిమిషంలో రిజిస్ట్రేషన్ మానేయాలి, సర్వర్ లోడ్ ఉండే అవకాశం ఉంటుంది.
- అవసరమైన డాక్యుమెంట్లు ముందే స్కాన్ చేసి సిద్ధం చేసుకోవాలి.
- హెల్ప్‌లైన్ నంబర్లు: 0866‑2974530 / 91540 66647
AP ICET 2025 కౌన్సెలింగ్ మొదటి దశకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని, కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి, నిర్ణీత గడువు లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తదుపరి దశల ప్రకారం సీటు కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ,కాలేజ్ రిపోర్టింగ్ జరగనున్నాయి. చివరి నిమిషానికి మించి ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని దశలు పూర్తి చేయడం చాలా ముఖ్యం.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.