AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష 2026: ప్రశ్నపత్ర నమూనా, గత ప్రశ్నల విశ్లేషణ & లైవ్ అప్‌డేట్స్
AP ఇంటర్ 1వ సంవత్సరం తెలుగు పరీక్ష 2026 ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ లైవ్ అప్‌డేట్స్ బ్లాగ్ లో ప్రశ్నపత్ర విశ్లేషణ, గత ప్రశ్నలు మరియు విద్యార్థుల స్పందనలు అందుబాటులో ఉంటాయి చూడండి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి (BIEAP) నిర్వహిస్తున్నAP ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 2026 ఫిబ్రవరి 23, 2026 నుంచి మార్చి 24, 2026 వరకు జరుగనున్నాయిపరీక్షలు ప్రతిరోజూ ఒకే సెషన్‌లోఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలతోనే విద్యార్థుల పరీక్షా ప్రయాణం ప్రారంభమవుతుండగా, ముందుగాఫిబ్రవరి 23, 2026 నాడు తెలుగు/భాషా పేపర్–Iమొదటి పరీక్షగా నిర్వహిస్తారు. భాషా పేపర్ కావడంతో విద్యార్థులు కొంత ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ, కానీ సరైన ప్రిపరేషన్ లేకపోతే ఆశించిన మార్కులు దక్కకపోవచ్చు.
తెలుగు పరీక్షను చాలా మంది విద్యార్థులు సాధారణంగా “ఈజీ పేపర్”గా భావిస్తారు. నిజానికి ఇది ఎక్కువ మార్కులు సాధించడానికి మంచి అవకాశం ఇస్తుంది. అందుకే చివరి నిమిషం ప్రిపరేషన్ చాలా ముఖ్యమైనది. చివరి రోజున పాఠ్యాంశాల సారాంశం ఒకసారి చదవడం, ముఖ్యమైన కవులు–రచయితల వివరాలు గుర్తుచేసుకోవడం, వ్యాకరణ భాగాన్ని రివైజ్ చేయడం, అలాగే మోడల్ ప్రశ్నలు మరియు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా మార్కుల్లో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది.ముఖ్యంగా వ్యాసాలు, భావర్ధాలు, ప్రశ్నోత్తరాలు వంటి విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టితే తెలుగు పరీక్షలో మంచి ఫలితం సాధించే అవకాశం ఉంటుంది.
AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు పరీక్ష 2026: పరీక్ష వివరాలు, విభాగాలు & మార్కుల కేటాయింపు (AP Inter First Year Telugu Exam 2026: Exam Details, Sections & Marks Allocation)
ఈ కింద పట్టికలో AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు (భాషా పేపర్–I) పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం, పేపర్ విభాగాలు మరియు మార్కుల విధానాన్ని ఒకే చోట స్పష్టంగా చూపిస్తున్నాం.
అంశం | వివరాలు |
పరీక్ష పేరు | AP ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం తెలుగు పరీక్ష (భాషా పేపర్–I) |
విద్యా సంవత్సరం | 2025-2026 |
నిర్వహించే సంస్థ | ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి (BIEAP) |
పరీక్ష తేదీ | ఫిబ్రవరి 23, 2026 |
పరీక్ష సమయం | ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు |
పరీక్ష సెషన్ | ఒకే సెషన్ |
మొత్తం మార్కులు | 100 మార్కులు |
మొత్తం విభాగాలు | 4 విభాగాలు ( గద్య భాగం 30 మార్కులు , పద్య భాగం 30 మార్కులు , వ్యాకరణం 20 మార్కులు , సృజనాత్మక రచన 20 మార్కులు ) |
మూల్యంకన విధానం | రాత పరీక్ష (Theory ) |
ప్రశ్నపత్ర భాష | తెలుగు |
పరీక్ష స్థాయి | ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ |
ఫలితాలు విడుదల తేదీ | ఏప్రిల్ చివరి వారం లేదా మే 2026లో |
అధికారిక వెబ్‌సైట్ | bie.ap.gov.in |
గత ప్రశ్నపత్రాల విశ్లేషణ: తెలుగు పేపర్‌లో ఎక్కువగా వచ్చే ప్రశ్నలపై స్పష్టత (Analysis of past question papers: Clarification on the most frequently asked questions in the Telugu paper)
గత 5 సంవత్సరాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎక్కువ ప్రశ్నలు పాఠ్యాంశాల నుంచే నేరుగా అడిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా గద్య–పద్య భాగాల భావాలు, అర్థాలు, ప్రశ్నలు తరచుగా పునరావృతమవుతున్నాయి. అలాగే వ్యాకరణ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు విద్యార్థులకు ఖచ్చితంగా మార్కులు రాబట్టే మంచి అవకాశం ఇస్తాయి. అందుకే గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిద్దమయ్యి చదివితే తెలుగు పరీక్షలో మంచి స్కోర్ సాధించడం సులభం.
ఈCollegeDekho QnA zoneలైవ్ బ్లాగ్‌లో మేము గత ప్రశ్నపత్రాల్లో ఎక్కువగా వచ్చిన ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నల జాబితా, అలాగే ఏ విభాగానికి ఎంత ప్రాధాన్యం ఉందో స్పష్టంగా తెలియజేస్తూ అప్‌డేట్స్ అందించాం చూడండి.
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష 2026: ప్రశ్నపత్ర నమూనా, గత ప్రశ్నల విశ్లేషణ & లైవ్ అప్‌డేట్స్
Feb 20, 2026 12:00 AM IST
గద్య ప్రశ్నలో రచయిత పేరు గుర్తు రాకపోతే ఏమి చేయాలి?
రచయిత పేరు అవసరమైతే కాకపోతే మర్చిపోయినా పెద్దగా సమస్య లేదు. పాఠంలోని భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం ముఖ్యమైంది.
Feb 19, 2026 11:00 PM IST
AP ఇంటర్ తెలుగు పేపర్‌లో పద్య భావం రాస్తున్నప్పుడు మార్కులు కోల్పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
పద్యాన్ని యధాతధంగా కాపీ చేయాల్సిన అవసరం లేదు. కవి వ్యక్తం చేయాలనుకున్న భావాన్ని మీ స్వంత మాటల్లో స్పష్టంగా రాయాలి. భావం స్పష్టంగా ఉంటే, పదాలు సులభంగా ఉన్నా మార్కులు తగ్గవు
Feb 19, 2026 10:00 PM IST
AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు నాన్- డీటైల్: 6 మార్కులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు
ఈ క్రింది పట్టికలో ఇచ్చిన నాన్- డీటైల్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులు సుమారు 20 పంక్తుల్లో సిద్ధం చేసుకోవడం మంచిది.
క్రమ సంఖ్య
నాన్- డీటైల్
1
దుర్గాబాయి దేశముఖ జీవిత చరిత్రను తెలియజేయండి.
2
తెలుగు భాషా విశిష్టతను వివరించండి.
3
పావురాలు వలలో తగులుకున్న విధం తెల్పండి.
4
యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.
5
స్త్రీ జనోద్ధరణకు కందుకూరివారు చేసిన కృషిని తెల్పండి.
Feb 19, 2026 09:00 PM IST
AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు గద్య భాగం: 6 మార్కులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు
ఈ క్రింది పట్టికలో ఇచ్చిన గద్య భాగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులు సుమారు 20 పంక్తుల్లో సిద్ధం చేసుకోవడం మంచిది.
క్రమ సంఖ్య
గద్య భాగం
1
వేములపల్లి శ్రీకృష్ణ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ?
2
ప్రహ్లాదుని విద్యాభ్యాస వృత్తాంతాన్ని వివరించండి.
3
సంక్రాంతి పండుగ మానవాళికిచ్చే సందేశాన్ని విశ్లేషించండి.
4
మిత్ర భేదం పాఠ్యభాగం ద్వారా తెలియ వచ్చే నీతిని వివరించండి.
5
తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన విధానాన్ని వ్రాయండి.
Feb 19, 2026 08:00 PM IST
AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు పద్య భాగం: 6 మార్కులకు అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు
ఈ క్రింది పట్టికలో ఇచ్చిన పద్య భాగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులు సుమారు 20 పంక్తుల్లో సిద్ధం చేసుకోవడం మంచిది.
క్రమ సంఖ్య
పద్య భాగం
1
ఎన్నోయేండ్లు గతించి పాషాణముల్!
2
ఆపదలందు ధైర్యగుణ - సజ్జనాళికిన్.
3
బసవేశ్వరుని పెండ్లి ఆధారంగా ఆంధ్రుల వివాహ వేడుకలను వివరించండి.
4
జలముల నగ్ని, .... మూర్ఖత మాన్పవచ్చునే!
5
అన్నమయ్య సంకీర్తన లోని సారాంశాన్ని వివరించండి.
Feb 19, 2026 07:00 PM IST
ఏ ప్రశ్న ఎంత రాయాలో ఎలా అర్ధం చేసుకోవాలి?
AP ఇంటర్ 2026 ప్రశ్నాపత్రం మార్కులు చూసి అంచనా వేయాలి. 2 మార్కుల ప్రశ్నకు చిన్న సమాధానం, 6 మార్కుల ప్రశ్నకు సుమారు 20 పంక్తులు సరిపోతాయి.
Feb 19, 2026 06:40 PM IST
AP ఇంటర్ తెలుగు పరీక్షలో మార్కులపై ప్రభావం చూపే అంశాలు ?
అంశం ప్రభావం పాఠ్యాంశాల అవగాహన మార్కులు పెరుగుతాయి వ్యాకరణంపై పట్టు ఖచ్చితమైన స్కోర్ హెడింగ్స్ & పాయింట్లు సమాధానం ఆకర్షణీయంగా ఉంటుంది వర్ణదోషాలు ఎక్కువగా ఉండడం మార్కులు తగ్గే అవకాశం టైమ్ మేనేజ్‌మెంట్ అన్ని ప్రశ్నలు పూర్తి చేయగలరు Feb 19, 2026 06:20 PM IST
AP ఇంటర్ 2026 తెలుగు పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి ?
- మొదటి 5 నిముషాలు ప్రశ్నాపత్రం మొత్తం ఓసారి చూడాలి
- బాగా వచ్చిన ప్రశ్నలతో ముందుగా మొదలు పెట్టాలి
- ఎక్కువ మార్కుల ప్రశ్నలకు ఎక్కువ సమయం ఇవ్వాలి
- చివరి 10 ఇమిషాలు రివిజన్ కు కేటాయించాలి
Feb 19, 2026 06:00 PM IST
ఒక్క ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి?
AP ఇంటర్ 2026 మొత్తం సమయాన్ని మార్కుల ప్రకారం పంచుకోవాలి. 6 మార్కుల ప్రశ్నకు సుమారు 12-15 నిముషాలు కేటాయిస్తే సరిపోతుంది.
Feb 19, 2026 05:40 PM IST
సమాధానాలు పొడవుగా రాయాలా లేదా పాయింట్లలో రాయాలా ?
AP ఇంటర్ 2026 తెలుగు పరీక్షలో వివరణాత్మక ప్రశ్నలకు పేరాగ్రాఫ్ పద్దతిలో రాయడం మంచిది.అవసరమైన చోట పాయింట్లలో రాయవచ్చు.
Feb 19, 2026 05:20 PM IST
AP ఇంటర్ తెలుగు పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయా ?
లేదు. AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు పరీక్ష పూర్తిగా రాత పద్దతిలో (Descriptive) నిర్వహించబడుతుంది.అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానాలు రాయాలి.
Feb 19, 2026 05:00 PM IST
AP ఇంటర్ 2026 తెలుగు పరీక్ష ఈజీగా ఉంటుందా ?
AP ఇంటర్ 2026 తెలుగు పరీక్ష సిలబస్ ఆధారంగానే ఉంటుంది. సరైన రివిజన్ చేసి, ముఖ్యమైన ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది మరియు మంచి మార్కులు సాధించవచ్చు.
Feb 19, 2026 04:40 PM IST
AP ఇంటర్ తెలుగు పరీక్ష ఎంత సమయం ఉంటుంది?
AP ఇంటర్ తెలుగు పరీక్ష ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మొత్తం 3 గంటల పాటు జరుగుతుంది.
Feb 19, 2026 04:15 PM IST
తెలుగు పరీక్ష ఎంత సమయం ఉంటుంది ?
ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో గద్య, పద్య, వ్యాకరణం, సృజనాత్మక రచన అనే విభాగాలు ఉంటాయి.
Feb 19, 2026 03:40 PM IST
ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు 2026: 6 మార్కుల ముఖ్యమైన ప్రశ్నల జాబితా
- ప్రహ్లాదుని విద్యాభ్యాస వృత్తాంతాన్ని వివరించండి.
- సంక్రాంతి పండుగ మానవాళికిచ్చే సందేశాన్ని విశ్లేషించండి.
విద్యార్థులు ఈ ప్రశ్నలకు సుమారు 20 పంక్తుల్లో స్పష్టంగా, అంశానికి సంబంధించిన విషయాలతో సిద్ధం చేసుకోవాలి. పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు పాఠ్యంశాల ఆధారంగా సమాధానాలు రాయడం ఎంతో ముఖ్యం.
Feb 19, 2026 03:15 PM IST
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చే విభాగాలు ఏవి ?
తెలుగు పరీక్షలో గద్య భాగం, పద్య భాగం మరియు వ్యాకరణ విభాగం ఎక్కువ మార్కులు తెచ్చే విభాగాలుగా ఉంటాయి.ముఖ్యంగా భావర్ధాలు, ప్రశ్నోత్తరాలు, పద్య భావం మరియు సంధులు -- సమాసాలు ప్రశ్నలు సులభంగా ఉంటాయి. వీటిపై దృష్టి పెట్టితే మంచి స్కోర్ సాధించవచ్చు.