AP Inter Results 2025 లైవ్ అప్‌డేట్లు, కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్లు ఇక్కడ అందిస్తాం.
AP ఇంటర్ ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్స్, విడుదల తేదీ సమయం (AP Inter Results 2025 LIVE Updates: Date and Time Soon, Grading System) : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు అంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఇంటర్
ఫలితాల విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ అందిస్తాం. ముఖ్యంగా విడుదల తేదీ, సమయానికి సంబంధించిన సమాచారం ఇక్కడ పొందవచ్చు. AP ఇంటర్ 2025 ఫలితాలు మనబడి, సాక్షి విద్య, ఈనాడు ప్రతిభ, మరెన్నో వెబ్‌సైట్‌లలో యాక్టివేట్ చేయబడతాయి. ఈ పేజీలో కూడా ఇంటర్ ఫలితాల డౌన్‌లోడ్ లింక్‌లను అందిస్తాం. ఫలితాలను పొందడానికి విద్యార్థులు తమ AP ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ 2025ని కలిగి ఉండాలి. AP ఇంటర్ ఫలితాలు 2025 మార్కులు, గ్రేడ్‌ల రూపంలో ప్రకటించబడతాయి. ఇప్పటికే విద్యార్థుల్లో ఏపీ ఇంటర్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 డిజి లాకర్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కేవలం ఇంటర్ ఫలితాలను మాత్రమే ప్రకటిస్తుంది. టాపర్ల లిస్ట్‌ను ప్రకటించదు. కానీ ఫలితాల్లో ఏ జిల్లాలు టాప్‌లో నిలిచాయో, ఎంత మంది పాస్ అయ్యారో అనే విషయాలను వెల్లడిస్తుంది. ప్రతి ఏడాది పాస్ పర్సంటేజ్‌లో ఏ జిల్లా ముందుందో, బాలురు, బాలికల్లో ఎవరి ఉత్తీర్ణత శాతం ఎక్కువుందో ప్రకటించడం జరుగుతుంది.
లేటెస్ట్:
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎన్ని గంటలకు విడులవుతాయి?
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ, సమయం (AP Inter Result 2025 Release Date and Time)
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందించాం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ కచ్చితంగా సమాచారాన్ని అందిస్తాం.
| ఏపీ ఇంటర్ 2025 ఫలితాల తేదీ | ఏప్రిల్ 12,2025 |
| AP Inter Results 2025 ప్రకటన సమయం | ఉదయం 11 గంటలకు |
| AP Inter Results 2025 ఫలితాల లింక్ యాక్టివేషన్ సమయం | ఉదయం 11 గంటలకు |
AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2025 (AP Intermediate Grading System 2025)
బోర్డు పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కుల సంఖ్య ఆధారంగా వారికి గ్రేడ్‌లు ప్రదానం చేస్తారు. AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్‌లో A1 నుండి F వరకు గ్రేడ్‌లు ఉంటాయి. ఈ దిగువున ఇవ్వబడిన పట్టిక నుంచి మార్కుల పరిధి, గ్రేడ్ పాయింట్లకు సంబంధించిన వివరాలను చెక్ చేయడి.
తరగతులు | మార్కుల పరిధి | గ్రేడ్ పాయింట్లు |
A1 | 91 నుంచి 100 మార్కులు | 10 |
A2 | 81 నుంచి 90 మార్కులు | 9 |
B1 | 71 నుంచి 80 మార్కులు | 8 |
B2 | 61 నుంచి 70 మార్కులు | 7 |
C1 | 51 నుంచి 60 మార్కులు | 6 |
C2 | 41 నుంచి 50 మార్కులు | 5 |
D1 | 35 నుంచి 40 మార్కులు | 4 |
F | 00 నుంచి 34 మార్కులు | ఫెయిల్ |
AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2025: డివిజన్ వారీగా (AP Intermediate Grading System 2025: Divisionనుంచిwise)
BIEAPలో విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డు డివిజన్‌లను స్వీకరిస్తుంది. 2025 AP ఇంటర్ ఫలితాల్లో డిస్టింక్షన్, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ మరియు థర్డ్ డివిజన్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని బోర్డు పంచుకుంటుంది.
విభజన | మార్కుల పరిధి |
డిష్టిక్షన్ | 400, అంతకంటే ఎక్కువ |
ఫస్ట్ క్లాస్ | 300 నుండి 399 వరకు |
సెకండ్ క్లాస్ | 225 నుండి 299 మార్కులు |
థర్డ్ క్లాస్ | 150 నుండి 224 మార్కులు |
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్స్
Apr 12, 2025 06:58 AM IST
కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు 2025
ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి.
Apr 11, 2025 11:49 AM IST
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల 2025
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12వ తేదీన విడులవుతాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు.
Apr 10, 2025 12:33 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాయి?
సాధారణంగా ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేయడ జరుగుతుంది.
Apr 09, 2025 06:00 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాల్లో A1 గ్రేడ్ పొందడానికి ఎన్ని పాయింట్లు సాధించాలి?
ఏపీ ఇంటర్ ఫలితాల్లో A1 గ్రేడ్ కోసం విద్యార్థులు 100 మార్కులకు 91 లేదా అంతకంటే ఎక్కువ సాధించాల్సి ఉంటుంది.
Apr 09, 2025 05:20 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 ఎవరు విడుదల చేయనున్నారు?
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సారి ఇంటర్మీడియట్ ఫలితాలను 2025 విడుదల చేసే అవకాశం ఉంది.
Apr 09, 2025 04:56 PM IST
ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫలితాల వివరాలు
పరీక్ష పేరు ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వాహక సంస్థ BIEAP పరీక్ష తేదీలు 3 మార్చి 2025 నుండి 20 మార్చి 2025 వరకు ఫలితాల తేదీ ఏప్రిల్ 12 లేదా 13 2025 Apr 09, 2025 12:13 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఏ వెబ్‌సైట్లో చూడొచ్చు?
ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు చెక్ చేయాల్సిన వెబ్‌సైట్‌ల లిస్ట్‌ను ఈ దిగువున అందించాం.
- ap.nic.in
- ap.gov.in
- bie.ap.gov.in
- examresults.ap.nic.in
Apr 08, 2025 05:41 PM IST
AP ఇంటర్ ఫలితాల మునుపటి సంవత్సరం పాస్ పర్సంటైజ్ ఎంతంటే?
సంవత్సరం ఉత్తీర్ణత శాతం 2024 76 శాతం 2023 72 శాతం 2022 61 శాతం 2021 100 శాతం 2020 63 శాతం Apr 08, 2025 03:12 PM IST
12 లేదా 13న ఇంటర్ ఫలితాలు 2025?
ఈ నెల 12 లేదా 13 తేదీల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.
Apr 08, 2025 02:30 PM IST
వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు ఏమిటి?
- విద్యార్థుల రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్
- పుట్టిన తేదీ
Apr 08, 2025 02:00 PM IST
AP ఇంటర్ ఫలితాలు 2025 రీ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫీజు ఎంత?
మార్కుల రీకౌంటింగ్ లేదా మార్కుల రీవాల్యుయేషన్ కోసం సబ్జెక్ట్‌కు రూ.260లు చెల్లించాల్సి ఉంటుంది.
Apr 08, 2025 01:30 PM IST
ఏపీ ఇంటర్ 2025 సప్లిమెంటరీ పరీక్షఎప్పుడు జరుగుతుంది?
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2025 మే 2025లో జరిగే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్ష 2025లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావచ్చు.
Apr 08, 2025 01:05 PM IST
వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎలా చెక్ చేసుకోవాలి?
- మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- 'Hi' అని టైప్ చేసి 9552300009 నెంబర్‌కు పంపించాలి.
- తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో 'విద్యా సేవలు' పై క్లిక్ చేసి, ఆపై 'పరీక్షా ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి (ఇంటర్మీడియట్)' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఏపీ ఇంటర్ ఫలితం 2025 డౌన్‌లోడ్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ హాల్ టికెట్ నెంబర్‌ను సబ్మిట్ చేయాలి.
- మీ మార్కుల మెమో పంపబడుతుంది.
Apr 08, 2025 10:27 AM IST
ఏపీ ఇంటర్ 2025 పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు?
ఏపీ ఇంటర్ 2025 పరీక్షలకు దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
Apr 08, 2025 09:38 AM IST
ఏపీ ఇంటర్ సెకండియర్ 2025లో ఫెయిల్ అయితే ఎలా?
ఏపీ ఇంటర్ సెకండియర్ 2025లో ఫెయిల్ అయితే విద్యార్థులు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్లీ పాస్ అవ్వొచ్చు.
Apr 08, 2025 08:54 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాల్లో టాపర్ల లిస్ట్ 2025 రిలీజ్ చేస్తారా?
ఏపీ బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాల 2025ను మాత్రమే ప్రకటిస్తుంది. టాపర్ల జాబితాను విడుదల చేయదు.
Apr 07, 2025 09:00 PM IST
2024 ఏపీ 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాలు ఏమిటి?
- కృష్ణ
- గుంటూరు
- ఎన్టీఆర్
- విశాఖపట్నం
- తూర్పు గోదావరి
Apr 07, 2025 08:00 PM IST
2024 ఏపీ ఇంటర్ ఫలితాల్లో 1వ సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత శాతం ఏ జిల్లాలో నమోదైంది?
- కృష్ణ
- గుంటూరు
- ఎన్టీఆర్
- విశాఖపట్నం
- తూర్పుగోదావరి
Apr 07, 2025 07:12 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 తర్వాత ఏమిటి?
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులతో పాసైన అభ్యర్థులు తమకు ఇష్టమైన మార్గంలో వెళ్లవచ్చు. కొందరు ఎంసెట్, పాలిటెక్నిక్ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ వైపు అడుగులు వేస్తారు.
Apr 07, 2025 06:18 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలను SMS ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ?
- మీ ఫోన్‌లో మెసెజ్ ఓపెన్ చేయాలి.
- APGEN1 < స్పేస్ > రోల్ నెంబర్ (1వ సంవత్సరానికి) లేదా APGEN2 < స్పేస్ > రోల్ నెంబర్ (2వ సంవత్సరానికి) అని టైప్ చేయాలి.
- దీనిని 56263కు పంపించాలి.
- మీరు మీ ఫలితాన్ని SMS ద్వారా అందుకుంటారు.
Apr 07, 2025 04:34 PM IST
ఏపీ ఇంటర్ 2024 పాస్ పర్సంటేజ్ ఎంత?
గత ఏడాది అంటే 2024లో విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 67 శాతం మంది పాస్ అయ్యారు.
Apr 07, 2025 04:05 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలపై ఉత్కంఠ
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్రంలో విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలామంది ఇంటర్ బేస్‌పై పలు ఎంట్రన్స్ టెస్ట్‌లకు హాజరవుతారు. దీంతో ఇంటర్ ఫలితాలను అందరిలో ఆసక్తి నెలకొంది.
Apr 07, 2025 03:47 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 ఎలా చెక్ చేసుకోవాలి?
- హోంపేజీలో 'AP IPE ఫలితాలు 2025' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం ఫలితాల లింక్‌ను ఎంచుకోవాలి.
- మీరు లాగిన్ విండోకు రీ డైరెక్ట్ అవుతారు.
- మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఆపై సబ్మిట్ చేయాలి.
- మీ AP ఇంటర్ మార్కుల షీట్ స్క్రీన్‌పై కనబడతాయి.
- భవిష్యత్తు సూచన కోసం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Apr 07, 2025 02:40 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 SMS ద్వారా పొందవచ్చా?
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు SMS ద్వారా కూడా పొందే అవకాశం ఉంది.
Apr 07, 2025 02:20 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ను bieap-gov.org సందర్శించాలి.
Apr 07, 2025 02:00 PM IST
ఏపీ ఇంటర్ ఫెయిల్ అయితే తర్వాత ఏం చేయాలి?
ఏపీ ఇంటర్‌లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారు సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది.
Apr 07, 2025 01:45 PM IST
ఏపీ ఇంటర్‌లో పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు పొందాలి?
ఏపీ ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలలో కనీసం 35 శాతం, అంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 మార్కులు సాధించాలి.
Apr 07, 2025 01:10 PM IST
గత సంవత్సరాల ఏపీ 2వ సంవత్సరం ఫలితాల విడదల తేదీలు
గత కొన్నేళ్లుగా ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం విడుదల తేదీలను ఇక్కడ చూడండి
సంవత్సరం 2వ సంవత్సరం ఫలితాల తేదీ 2024 ఏప్రిల్ 12 2023 ఏప్రిల్ 26 2022 జూన్ 22 2021 జూలై 23 2020 జూన్ 12 Apr 07, 2025 12:45 PM IST
గత సంవత్సరాల ఏపీ ఫలితాలు ట్రెండ్
గత ఐదేళ్లుగా ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల తేదీలని ఇక్కడ అందించాం.
సంవత్సరం మొదటి సంవత్సరం ఫలితాల తేదీ 2024 ఏప్రిల్ 12 2023 ఏప్రిల్ 26 2022 జూన్ 22 2021 జూలై 23 2020 జూన్ 12 Apr 07, 2025 12:21 PM IST
ఏపీ ఇంటర్ పరీక్షలు 2025
ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1, 2025న ప్రారంభమయ్యాయి, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3, 2025న ప్రారంభమై మార్చి 20, 20న పరీక్షలు ముగిశాయి.
Apr 07, 2025 11:51 AM IST
ఏపీ ఇంటర్ పేపర్ల దిద్దుబాటు 2025
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. తొందర్లోనే ఫలితాలు విడుదలవుతాయి.
Apr 07, 2025 11:00 AM IST
వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు 2025
ఈ ఏడాది 2025 ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యార్థులు వాట్సాప్ ద్వారా చూసుకునే అవకాశం ఉంటుంది.
Apr 07, 2025 10:08 AM IST
అతి త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అతి త్వరలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయనుంది.
Apr 06, 2025 01:30 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్ కోసం ఫీజు ఎంత?
ఏపీ ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం రూ.100లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Apr 06, 2025 01:20 PM IST
ఏపీ ఇంటర్ ఫలితాలపై రీకౌంటింగ్‌కి ఛాన్స్ 2025
ఏపీ ఇంటర్ ఫలితాలపై 2025 అసంతృప్తి ఉంటే విద్యార్థులు రీకౌంటింగ్‌కి అప్లై చేసుకోవచ్చు.