AP KGBV అడ్మిషన్లు 2026 మార్చి 12 నుంచి KGBVల్లో అడ్మిషన్లు ప్రారంభం, ఎంట్రన్స్ పరీక్ష లేకుండానే ప్రవేశాలు
AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం మార్చి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం. ఎంట్రన్స్ పరీక్ష లేకుండా అర్హతలు, రిజర్వేషన్ మరియు సర్టిఫికెట్ల ఆధారంగా విద్యార్థినుల ఎంపిక జరుగుతుంది.
KGBVల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం (Applications for admissions to KGBVs begin):ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (KGBV) 2026–27 శిక్షణ సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం,మార్చి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు మరియు KGBV పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద బాలికలకు నాణ్యమైన విద్య అందించడం ఈ పాఠశాలల ప్రధాన లక్ష్యం.
KGBVల్లో అడ్మిషన్లకు విద్యార్థినులుఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ప్రవేశాల్లో ముఖ్యంగా 6వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థినులతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. కొన్ని KGBVలలో ఇంటర్ మొదటి సంవత్సరం కోసం కూడా ప్రవేశాలు కల్పించే అవకాశముంది. అర్హత ఉన్న విద్యార్థినులు సమయానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ అడ్మిషన్లలో ఎటువంటిరాత పరీక్ష లేదా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించబడదు.ఎంపిక పూర్తిగా విద్యార్హతలు, రిజర్వేషన్ నిబంధనలు మరియు సమర్పించిన సర్టిఫికెట్ల ఆధారంగా జరుగుతుంది. అందువల్ల పరీక్ష భయం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరంగా ఉన్న బాలికలకు మంచి అవకాశంగా నిలుస్తుంది.
KGBV అడ్మిషన్లు 2026: ముఖ్యమైన తేదీలు (KGBV Admissions 2026: Important Dates)
AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి అధికారులు ముఖ్యమైన తేదీలను ఈ క్రింద ఇవ్వబడింది.
వివరాలు | తేదీలు |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | మార్చి 12,2026 |
దరఖాస్తులకు చివరి తేదీ | ఏప్రిల్ 01,2026 |
ఎంపిక జాబితా విడుదల తేదీ | ఏప్రిల్ 13,2026 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు | ఏప్రిల్ 13 - 17 ,2026 |
ఏప్రిల్ 13న సెలక్షన్ లిస్ట్ (Selection list on April 13th)
ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. సెలెక్ట్ అయిన విద్యార్థినులుఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 సమయంలోసంబంధిత KGBV పాఠశాలలో తమ సర్టిఫికెట్ లని సమర్పించి ధ్రువీకరణ చేయించుకోవాలి. అధికారులు తెలియజేసిన ప్రకారం ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
KGBV చదివే విద్యార్థినులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది.ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి మరియు నివాస సౌకర్యలు కూడా అందిస్తారు. గ్రామీణ మరియు ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల బాలికలకు ఇది మంచి విద్యా అవకాశంగా నిలుస్తుంది.అందువల్ల అర్హత ఉన్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.