AP KGBV ప్రవేశాలు 2026: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026–27 సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన బాలికలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
AP KGBV 2026 ప్రవేశాల నోటిఫికేషన్ వివరాలు (AP KGBV 2026 Admissions Notification Details):ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ల కోసం అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. పేద మరియు వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించడమే ఈ పాఠశాలల ప్రధాన లక్ష్యం. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 12, 2026 నుంచి దరఖాస్తు చేయవచ్చు.
ఈ అడ్మిషన్లలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 7వ, 8వ, 9వ, 10వ తరగతుల ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అధికారుల వివరాల ప్రకారం ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులే అడ్మిషన్ ప్రక్రియలో పరిగణించబడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 35 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు పనిచేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో చేరిన విద్యార్థినులకు ఉచిత విద్యతో పాటు నివాసం, భోజనం మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది.
అడ్మిషన్లకు సంబంధించిన కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. పేద కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. అంతేకాక అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, చదువు మానేసిన డ్రాపౌట్ విద్యార్థినులు, పేద కుటుంబాలకు చెందిన SC, ST, BC మరియు మైనారిటీ వర్గాల బాలికలకు కూడా ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 6వ తరగతి ప్రవేశానికి అభ్యర్థి తప్పనిసరిగా 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌కి ప్రవేశం కోసం 10వ తరగతి పాస్ కావాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు లింక్ ?
AP 2026–27 విద్యా సంవత్సరానికి KGBV ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న బాలికలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయచ్చు. KGBV లింక్ ఈ క్రింద ఇవ్వబడింది.
ఈ ప్రవేశాలకు రాత పరీక్ష నిర్వహించబడదు. విద్యార్థుల అర్హత, రిజర్వేషన్ ప్రమాణాలు మరియు సమర్పించిన సర్టిఫికెట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అందుకే అర్హత కలిగిన విద్యార్థినులు నిర్ణయించిన గడువులో దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులచివరి తేదీ ఏప్రిల్ 1, 2026గానిర్ణయించారు.
KGBV అడ్మిషన్లు 2026: ముఖ్యమైన తేదీలు (KGBV Admissions 2026: Important Dates)
AP కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి అధికారులు ముఖ్యమైన తేదీలను ఈ క్రింద ఇవ్వబడింది.
వివరాలు | తేదీలు |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | మార్చి 12,2026 |
దరఖాస్తులకు చివరి తేదీ | ఏప్రిల్ 01,2026 |
ఎంపిక జాబితా విడుదల తేదీ | ఏప్రిల్ 13,2026 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు | ఏప్రిల్ 13 - 17 ,2026 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.