విద్యార్థులకు గుడ్‌న్యూస్, రేపటి వరకు ఛాన్స్
ఏపీ పాలిసెట్‌కి (AP POLYCET 2025 Registration Date Extended) దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించడం జరిగింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
ఏపీ పాలిసెట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగింపు (AP POLYCET 2025 Registration Date Extended) :
ఏపీ పాలిసెట్ 2025 రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (SBTET) ఏపీ పాలిసెట్ అప్లికేషన్ డేట్‌ని ఏప్రిల్ 17, 2025 వరకు పొడిగించింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు polycetap.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అందించే ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఏపీ పాలిసెట్ 2025ని నిర్వహిస్తారు.
ఇది చూడండి:
ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి?
AP POLYCET 2025 అప్లికేషన్ లింక్ (AP POLYCET 2025 Application Link )
AP POLYCET 2025 అప్లికేషన్ లింక్‌ని ఈ దిగువున ఇవ్వడం జరిగింది. అభ్యర్ధులు ఆ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ పాలిసెట్ 2025 - ముఖ్యమైన తేదీలు (AP POLYCET 2025 - Important Dates)
ఏపీ పాలిసెట్ 2025కి దరఖాస్తు ప్రక్రియ మార్చి 12, 2025 నుంచి ప్రారంభమైంది. ఏపీ పాలిసెట్ 2025 ఏప్రిల్ 30, 2025న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరగనుంది.
ఏపీ పాలిసెట్ 2025 అర్హత ప్రమాణాలు (AP POLYCET 2025 Eligibility Criteria)
ఏపీ పాలిసెట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
- అభ్యర్థులు భారత జాతీయులై ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
- SSC బోర్డు పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- AP POLYCET 2025 పరీక్షకు హాజరు కావడానికి వయోపరిమితి లేదు.
AP POLYCET 2025కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply For AP POLYCET 2025)
ఏపీ పాలిసెట్ 2025కి అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ఇక్కడ చూడండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను polycetap.nic.in సందర్శించాలి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న 'AP POLYCET 2025' లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో వివరాలను ఫిల్ చేయాలి.
- అభ్యర్థులు తమ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.