AP RCET 2025 ఇంటర్వ్యూ లిస్ట్ డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే ఛాన్స్
AP RCET 2025 ఇంటర్వ్యూ జాబితా డిసెంబర్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తాజా సమాచారం కోసం తనిఖీ చేస్తూ ఉండాలి.
AP RCET 2025 ఇంటర్వ్యూ కీలక వివరాలు(AP RCET 2025 Interview Key Details): AP RCET 2025 ఇంటర్వ్యూ జాబితా గురించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. రాత పరీక్ష తర్వాత అభ్యంతరాలు, సమాధాన కీ పరిశీలన, అర్హత పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయ్యే దశలో ఉన్నందున, ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విడుదల దశలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ జాబితాలో ఇంటర్వ్యూకి అర్హులైన అభ్యర్థుల పేర్లు, తేదీలు, సెషన్ వివరాలు ఉంటాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి జాబితాను చూడొచ్చు.
ఇంటర్వ్యూను AP RCETలో కీలక దశగా చూడాలి. రాత పరీక్ష స్కోరు తో పాటు, ఇంటర్వ్యూలో చూపించే పరిశోధనా సామర్థ్యం, సబ్జెక్టుపై అవగాహన, రీసెర్చ్ ప్రపోసల్ కంటెంట్ వంటి అంశాలిపై తుది ఎంపిక ఆధారపడుతుంది. కాబట్టి అభ్యర్థులు ముందే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం, రీసెర్చ్ ఐడియా ప్రాక్టీస్ చేయడం, సంబంధిత విభాగంపై ప్రాథమిక అవగాహన పెంపొందించడం మంచిది. ఇంటర్వ్యూతేదీలు విడుదలైన వెంటనే ఏర్పాట్లు పూర్తి చేసుకుంటే ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయి.
AP RCET 2025 ఇంటర్వ్యూకి అవసరమైన పత్రాలు (Required Documents for AP RCET 2025 Interview)
AP RCET 2025 ఈ క్రింది పత్రాలు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాలి.
- AP RCET 2025 హాల్ టికెట్
- AP RCET 2025 ర్యాంక్ కార్డ్ / స్కోర్ కార్డ్
- ఫోటో ఐడీ ప్రూఫ్ (ఆధార్ / పాన్ / డ్రైవింగ్ లైసెన్స్)
- 10వ తరగతి సర్టిఫికెట్ (పుట్టిన తేదీ కోసం)
- ఇంటర్ / డిగ్రీ / పీజీ సర్టిఫికెట్లు మరియు మార్కుల మెమోలు
- కుల ధృవపత్రం (అవసరమైతే)
- ఆదాయ ధృవపత్రం / EWS సర్టిఫికెట్ (అవసరమైతే)
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
- స్టడీ సర్టిఫికెట్లు / రెసిడెన్స్ ప్రూఫ్
- రిసెర్చ్ ప్రపోజల్ (విభాగం కోరితే)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- విశ్వవిద్యాలయం కోరే ఇతర పత్రాలు
AP RCET 2025 విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు (Important instructions for AP RCET 2025 students)
AP RCET 2025 ఇంటర్వ్యూతో సంబంధించిన అభ్యర్థులు ఈ సూచనలను తప్పక పాటించండి.
- ఇంటర్వ్యూ తేదీ, సమయం, మరియు కేంద్రం ముందుగానే చెక్ చేసుకోండి.
- అవసరమైన అన్ని పత్రాలను ఒరిజినల్స్ మరియు జిరాక్స్‌తో తీసుకెళ్తే మంచిది.
- నిర్ణయించిన సమయానికి కనీసం 30 నిమిషాలు ముందే చేరుకోండి.
- రీసెర్చ్ ప్రపోజల్ మరియు మీ సబ్జెక్ట్ ప్రాథమిక అంశాలను రివైజ్ చేయండి.
- ప్యానెల్ ప్రశ్నలకు స్పష్టంగా, ధైర్యంగా సమాధానమివ్వండి.
- మొబైల్ ఫోన్లు మరియు ఇతర అనవసర వస్తువులు వాడకండి.
- మీ ప్రవర్తన మరియు స్టైల్ కూడా మంచి ఇంప్రెషన్ కలిగించేలా పెట్టుకోండి.
- యూనివర్సిటీ ఇచ్చే అన్ని సూచనలు జాగ్రత్తగా పాటించండి.
AP RCET 2025 ఇంటర్వ్యూ జాబితా డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నందున. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా చెక్ చేసి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.