OC, BC, SC, ST కేటగిరీలకు AP TET అర్హత మార్కులు 2025 ఎంతో తెలుసా?
OC, BC, SC, ST కేటగిరీలకు AP TET క్వాలిఫైయింగ్ మార్కుల 2025 వివరాలు ఈ దిగువున అందించాం.
AP TET అర్హత మార్కులు 2025 (AP TET Qualifying Marks 2025) : ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే అభ్యర్థులకు AP TET 2025 అనేది అర్హత పరీక్ష. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆయా రంగంలో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ నిర్వహించింది. AP TET ఆన్సర్ కీ కూడా ఇప్పటికే విడుదలైంది. ఫలితాలు కూడా అతి త్వరలో రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు AP TETలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస అర్హత మార్కులు లేదా ఉత్తీర్ణత మార్కులను పొందాల్సి ఉంటుంది. AP TET కటాఫ్ 2025ని అర్హత లేదా ఉత్తీర్ణత మార్కులుగా చెప్పవచ్చు. AP TET ఫలితాలు 2025లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు AP TET సర్టిఫికెట్ 2025 ఇవ్వబడుతుంది. AP TET పరీక్ష 2025లో రెండు పేపర్లు ఉంటాయి - పేపర్ 1, పేపర్ 2. రెండు పేపర్లలో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున మొత్తం 150 బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు) ఉంటాయి.
OC, BC, SC, ST కేటగిరీలకు AP TET క్వాలిఫైయింగ్ మార్కులు 2025 (AP TET Qualifying Marks 2025 for OC, BC, SC, ST)
OC, BC, SC, ST కేటగిరీలకు AP TET క్వాలిఫైయింగ్ మార్కుల 2025 వివరాలు ఈ దిగువున అందించాం.
కేటగిరి | పాస్ పర్సంటేజ్ | పాస్ మార్కులు |
OC, EWS | 60 శాతం కంటే ఎక్కువ | 90 కంటే ఎక్కువ మార్కులు |
BC | 50 శాతం కంటే ఎక్కువ | 75 కంటే ఎక్కువ మార్కులు |
SC, ST | 40 శాతం కంటే ఎక్కువ | 60 కంటే ఎక్కువ మార్కులు |
AP TETలో కటాఫ్ మార్కులు పొందిన తర్వాత ఏమిటి? (What Next After Obtaining AP TET Cut-off Marks 2025?)
AP TETలో కటాఫ్ మార్కులు పొందిన తర్వాత ఏం చేయాలో? చాలామందికి తెలియదు. AP TETలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం అందుతుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా అభ్యర్థులు AP DSC ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT)కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ సర్టిఫికెట్‌ను జాయింట్ డైరెక్టర్, TET, ఆంధ్రప్రదేశ్ మెంబర్ కన్వీనర్ డిజిటల్ ఫార్మాట్‌లో జారీ చేస్తారు. AP TET సర్టిఫికెట్ అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in, DigiLocker ప్లాట్‌ఫామ్‌లో AP TET ఫలితాలు 2025 ప్రకటించిన తేదీ నుండి జారీ చేయబడుతుంది. ఈ సర్టిఫికెట్ జీవితాంతం చెల్లుబాటవుతుంది.
TET సర్టిఫికెట్‌లో ఉండే వివరాలు
అభ్యర్థి పేరు
అభ్యర్థి చిరునామా
రిజిస్ట్రేషన్
సర్టిఫికెట్ ప్రదానం చేసిన సంవత్సరం/నెల
ప్రతి పేపర్‌లో వచ్చిన మార్కులు
దాని చెల్లుబాటు తరగతి స్థాయి
విషయ ప్రాంతం
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
