AYUSH NEET UG 2025 రౌండ్ 1 సీటుల కేటాయింపు విడుదల, 3,415 సీట్లు ఖరారు
AYUSH NEET UG 2025 రౌండ్ 1 సీటు కేటాయింపు ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ రౌండ్‌లో మొత్తం 3,415 సీట్లు కేటాయించబడ్డాయి. పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
AYUSH NEET UG 2025 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల తేదీలు, రిపోర్టింగ్ & తదుపరి రౌండ్ వివరాలు (AYUSH NEET UG 2025 Seat Allotment Results Release Dates, Reporting & Next Round Details): AYUSH NEET UG 2025 రౌండ్ 1 సీటు కేటాయింపు ఫలితాలను 2025 సెప్టెంబర్ 4న అధికారికంగా ప్రకటించారు. ఈ రౌండ్‌లో మొత్తం 3,415 సీట్లు అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సీటు పొందిన విద్యార్థులు 2025 సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు తమకు కేటాయించిన కళాశాలకు హాజరై డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తి చేయాలి.వెరిఫికేషన్ తేదీలు సెప్టెంబర్ 13 నుండి 14,2025 . ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే అడ్మిషన్ ఖరారవుతుంది. రిపోర్టింగ్ గడువు లోపల కళాశాలకు హాజరు కాకపోతే లేదా పత్రాల లోపం ఉంటే సీటు రద్దవుతుంది. AYUSH NEET UG కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు BAMS, BHMS, BUMS, BSMS వంటి కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. రౌండ్ 1 అనంతరం మిగిలిన సీట్లు రౌండ్ 2 మరియు మాప్-అప్ రౌండ్ల ద్వారా భర్తీ చేయబడతాయి.
AYUSH NEET UG 2025 సీటు కేటాయింపు ఎలా చెక్ చేయాలి? (How to check AYUSH NEET UG 2025 seat allotment?)
AYUSH NEET UG 2025 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా సీటు కేటాయింపు ఫలితాలను ఈ క్రింద దాని విధముగా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ aaccc.gov.in ను ఓపెన్ చేయండి
- ఆ తరువాత హోమ్‌పేజీలో “UG Counselling 2025” లింక్‌పై క్లిక్ చేయండి
- “Seat Allotment Result – Round 1” ఎంపికను ఎంచుకోండి
- రిజిస్ట్రేషన్ నంబర్ , పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
- సీటు కేటాయింపు ఫలితాన్ని స్క్రీన్‌పై చెక్ చేసుకోండి
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి
AYUSH NEET UG 2025 రౌండ్ 2 షెడ్యూల్ (AYUSH NEET UG 2025 Round 2 Schedule)
రౌండ్ 1 పూర్తైన తర్వాత రౌండ్ 2 కౌన్సెలింగ్ కోసం AACCC త్వరలో పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తుంది.
- రౌండ్ 2 రిజిస్ట్రేషన్ ప్రారంభం , సెప్టెంబర్ రెండవ వారంలో
- ఎంపికల భర్తీ (Choice Filling & Locking) , రిజిస్ట్రేషన్ అనంతరం నిర్ణీత రోజులు
- రౌండ్ 2 సీటు కేటాయింపు ఫలితాలు , సెప్టెంబర్ చివర్లో
- కళాశాలకు రిపోర్టింగ్ , ఫలితాల తర్వాత నిర్ణీత తేదీలు
AYUSH NEET UG 2025 రౌండ్ 1లో 3,415 సీట్లు కేటాయించబడ్డాయి. విద్యార్థులు నిర్ణీత గడువులో కళాశాలకు హాజరై అడ్మిషన్ పూర్తి చేయాలి. మిగిలిన సీట్లు రౌండ్ 2 ,మిగిలిన చోట్ల రౌండ్లలో భర్తీ చేయబడతాయి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.