బాబా అణు పరిశోధనాల కేంద్రం (BARC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ (BARC Recruitment 2023) అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4374 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.56,100 జీతం అందుతుంది.
BARC రిక్రూట్‌మెంట్ 2023 (BARC Recruitment 2023):
ముంబై ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనాల కేంద్రం (BARC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (BARC Recruitment 2023) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4374 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం విధానంలో డీఏఈ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 22 దరఖాస్తులకు చివరి తేదీ. BARC DAE రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగ అవకాశం కోసం నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అందించిన రిక్రూట్‌మెంట్‌పై పూర్తి సమాచారాన్ని పొందడానికి ఈ ఆర్టికల్‌ను చదవొచ్చు.
ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి మంచి జీతం అందుతుంది. పోస్టును బట్టి జీతాల ఉంటాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400లు జీతం ఇవ్వడం జరుగుతుంది. మిగతా పోస్టులకు రూ.21000ల నుంచి రూ.26,000ల వరకు జీతం ఉంటుంది.
BARC రిక్రూట్‌మెంట్ 2023 ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి? (How to Apply Online for BARC Recruitment 2023?)
BARC రిక్రూట్‌మెంట్ 2023 ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఇక్కడ తెలుసుకోండి
BARC రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://barconlineexam.com సందర్శించాలి
వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
దరఖాస్తు ఫార్మ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
అభ్యర్థి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత చివరిగా దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.