BITS పిలానీలో ఇండస్ట్రియల్ IoT ల్యాబ్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
BITS పిలానీ హైదరాబాదు క్యాంపస్‌లో ఇండస్ట్రియల్ IoT ల్యాబ్‌కు ఇన్‌స్ట్రాక్టర్/విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BITS Pilaniలో ఇండస్ట్రియల్ IoT ఫ్యాకల్టీ ఖాళీలు (Industrial IoT Faculty Vacancies at BITS Pilani): బిట్స్ (BITS) Pilani హైదరాబాద్ క్యాంపస్‌లోని ఇండస్ట్రియల్ IoT ల్యాబ్‌లో ఇన్‌స్ట్రాక్టర్/విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన ఒకే ఒక్క ఖాళీ ఉందని పేర్కొనబడింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 30, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.హైరింగ్‌లో ల్యాబ్ నిర్వహణలో నైపుణ్యం, ఇండస్ట్రియల్ IoT సంబంధిత ప్రాక్టికల్ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం మరియు స్టూడెంట్స్‌తో కలిసి పని చేసే సామర్ధ్యాన్ని ముఖ్యంగా పరిశీలిస్తారు. అభ్యర్థులు ఫ్యాకల్టీ, స్టాఫ్ మరియు స్టూడెంట్స్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థి WILP విద్యార్థులకు ల్యాబ్ సెషన్లు నిర్వహించడం, ల్యాబ్ వ్యాయామాలు రూపకల్పన చేయడం, పరికరాల పర్యవేక్షణ మరియు సాఫ్ట్‌వేర్ లైసెన్సుల నిర్వహణ వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తించాలి. అదనంగా పరికరాల కాలక్రమ మెయింటెనెన్సు నిర్వహణ, ల్యాబ్ అభివృద్ధి పనులు, మరియు స్టూడెంట్స్ కు సాంకేతిక సహాయం అందించడం కూడా ఈ పోస్టులో ఉంటుంది. అవసరమైతే ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేయాలిసిన పరిస్థితులు కూడా ఉండచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడానికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్ణయం తీసుకోవబడుతుంది.
BITS Pilani ఆన్‌లైన్ దరఖాస్తు విధానం(BITS Pilani Online Application Procedure)
అభ్యర్థులు BITS Pilani ప్రకటించిన అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమె దరఖాస్తు చేయాలి.దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ క్రింది దశలను పాటించండి.
- ముందుగా BITS Pilani అధికారిక వెబ్‌సైట్ www.bits-pilani.ac.in ఓపెన్ చేయాలి.
- ఆ తరువాత Careers/Recruitment సెక్షన్‌కి వెళ్లాలి.
- Instructor / Visiting Faculty – Industrial IoT Lab పోస్టు నోటిఫికేషన్ ఎంపిక చేయాలి.
- "Apply Online" బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా, సరిగా నింపాలి.
- వ్యక్తిగత సమాచారం, విద్యా వివరాలు మరియు అనుభవ వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లు,స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- నమోదు చేసిన వివరాలు మరోసారి తనిఖీ చేసి "Submit"పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత గుర్తింపు/రెఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోవాలి.
- ఇంటర్వ్యూ/పరీక్ష వివరాలు తర్వాత అధికారికంగా తెలియజేయబడతాయి.
అర్హతలు(Eligibility Criteria )
ఈ పోస్టుకు కావాల్సిన విద్యా మరియు సాంకేతిక అర్హతలు నోటిఫికేషన్ ప్రకారం ఇలా ఉన్నాయి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Tech/B.E (Electrical/Electronics/Instrumentation) పూర్తయి ఉండాలి
- సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి
- ఇండస్ట్రియల్ IoT, PLC, మైక్రోకంట్రోలర్స్‌పై ప్రాక్టికల్ నైపుణ్యం ఉండాలి
- C, C++, Python, MATLAB వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో అనుభవం ఉండాలి
- AI–ML అనుభవం ఉంటే అదనపు బహుమతి
- స్టూడెంట్స్‌తో కలిసి పని చేయగలగాలి
BITS Pilani హైదరాబాదు క్యాంపస్‌లో ఇండస్ట్రియల్ IoT ల్యాబ్ కోసం ప్రకటించబడి ఉన్న ఈ పోస్టులు టెక్నికల్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకుని ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.