CTET 2026 రిజిస్ట్రేషన్ మళ్లీ ప్రారంభం, డిసెంబర్ 27 నుంచి పెండింగ్ దరఖాస్తులకు చివరి అవకాశం
CTET ఫిబ్రవరి 2026 కోసం CBSE డిసెంబర్ 27 ఉదయం 11 గంటల నుండి డిసెంబర్ 30,2025 వరకు దరఖాస్తు విండోను మళ్లీ ప్రారంభించింది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పూర్తి చేసుకునేందుకు ఇది అభ్యర్థులకు చివరి అవకాశం.
CTET 2026 రిజిస్ట్రేషన్ కు చివరి అవకాశం (Last chance for CTET 2026 registration): కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET) ఫిబ్రవరి 2026 కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు CBSE మరో అవకాశం ఇచ్చింది. CBSE బోర్డు ప్రకారం డిసెంబర్ 27 ఉదయం 11 గంటల నుంచి డిసెంబర్ 30,2025 రాత్రి 11:59 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభించి మధ్యలో ఆపేసిన అభ్యర్థులు ఈ సమయంలో తమ అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
CBSE విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈసారి మొత్తం 25.30 లక్షల మంది విజయవంతంగా దరఖాస్తు చేయగా, సుమారు 1.61 లక్షల అప్లికేషన్లు అసంపూర్తిగా జరిగాయి. ఫీజు చెల్లించకపోవడం లేదా తుది సబ్మిషన్ చేయకపోవడం కారణంగా అప్లికేషన్లు పూర్తి కాలేదు. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
దాదాపు ఒక సంవత్సరం విరామం తర్వాత CTET నిర్వహిస్తున్న నేపథ్యంలో, అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వన్‌టైమ్ అవకాశం ఇచ్చాం అని CBSE తెలిపింది. ఈ సమయంలో అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన సవరణలు చేసి తుది సబ్మిట్ చేయాలి. ఈ అవకాశం తర్వాత మరే విధమైన కరెక్షన్ అవకాశం ఇవ్వబడదు అన్నదీ బోర్డు స్పష్టం చేసింది.
CTET 2026 కోసం మళ్లీ దరఖాస్తు ఎలా చేయాలి? (How to reapply for CTET 2026?)
అభ్యర్థులు CTET 2026 కోసం మళ్లీ డిసెంబర్ 27 నుంచి 30 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ అప్లికేషన్‌ను ఈ క్రింద ఉన్న దశల ద్వారా పూర్తి చేయవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ఓపెన్ చేయండి
- ఆ తరువాత హోమ్‌పేజీలో CTET 2026 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వండి
- ఇప్పటికే సేవ్ చేసిన వివరాలను చూసి అవసరమైతే సవరించండి
- ఫోటో, సిగ్నేచర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదా అని నిర్ధారించండి
- అప్లికేషన్ ఫీజు పెండింగ్ ఉంటే చెల్లించండి
- చివరిగా ఫారమ్‌ను సబ్మిట్ చేయండి
- అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని పెట్టుకోండి
CTET కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ 1 నుంచి 8 వరకు ఉపాధ్యాయ పోస్టులకి అర్హత పొందడానికి అవసరమైన జాతీయ స్థాయి పరీక్ష. CBSE అభ్యర్థులకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ అప్లికేషన్ పూర్తి చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
