CTET 2026 ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం
CTET 2026 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అబ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో తమ లాగిన్ వివరాలతో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. CTET 2026 ఫలితాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
CTET 2026 ఫలితాలు విడుదల వివరాలు (CTET 2026 Results Release Details):కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) నిర్వహించిన CTET 2026 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన రాలేదు, కానీ గత సంవత్సరాల ట్రెండ్ చూసుకుంటే ఈ వారంలోనే రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా తమ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. పరీక్షలో పాల్గొన్న వారు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫిబ్రవరి 7 మరియు 8న నిర్వహించిన CTET 2026 లో ప్రాథమిక (తరగతులు 1–5) మరియు ఉన్నత ప్రాథమిక (తరగతులు 6–8) విభాగంలో బోధించాలనుకునే అభ్యర్థులు పాల్గొన్నారు. CBSE మార్చి 12న ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు తమ సమాధానాలను చూసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజు చెల్లించి రీవాల్యూయేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. సరైన అభ్యంతరాలు అయితే ఆ ఫీజు తిరిగి ఇవ్వబడతుందని CBSE స్పష్టం చేసింది. ప్రస్తుతం అందిన అన్ని అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ ఆన్సర్ కీ సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది, దాని తరువాతే ఫలితాలు విడుదల కానున్నాయి.
గత ట్రెండ్స్ ఆధారంగా CTET ఫలితాల విడుదల వివరాలు (CTET results release details based on past trends)
గత 5 సంవత్సరాల ట్రెండ్ చూస్తే, CTET ఫలితాలు సాధారణంగా పరీక్ష జరిగాక 3–4 వారాల్లో విడుదల అవుతున్నాయి.
సంవత్సరం | పరీక్ష తేదీలు | ఫలితాల విడుదల తేదీ |
2020 (2021లో నిర్వహణ ) | జనవరి 31,2021 | ఫిబ్రవరి 26,2021 |
2021 | డిసెంబర్ 16,2021-జనవరి 21,2022 | మార్చి 09,2022 |
2022 | డిసెంబర్ 28,2022-ఫిబ్రవరి 07,2023 | మార్చి 03,2023 |
2023 | ఆగష్టు 20,2023 | సెప్టెంబర్ 25,2023 |
2024 | జూలై 07,2024 | జూలై 31,2024 |
CTET 2026 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ? (CTET 2026 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ?)
CTET 2026 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో ఈ క్రింది విధముగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ఓపెన్ చేయండి
- హోమ్ పేజీలో ఉన్న “Public Notices” సెక్షన్లపై క్లిక్ చేయండి
- “CTET Feb 2026 Result” లింక్ ను ఎంపిక చేయండి.
- ఓపెన్ అయినా PDFలో ఉన్న రిజల్ట్ లింకుపై క్లిక్ చేయండి
- మీ Application Number మరియు Passowrd /Date of Birth నమోదు చేయండి
- స్క్రీన్ పై మీ ఫలితం కనిపిస్తుంది
- రిజల్ట్ ను డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది
CTET 2026 స్కోర్‌కార్డ్‌లో ఉండే వివరాలు (Details to be found in CTET 2026 scorecard)
CTET 2026 ఫలితాలు విడుదలైన తర్వాత స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంటుంది.
- పరీక్ష పేరు (CTET)
- రోల్ నంబర్
- అభ్యర్థి పేరు
- తల్లి పేరు
- తండ్రి పేరు
- కేటగిరీ (Category)
- పేపర్ వివరాలు (పేపర్ 1 / పేపర్ 2)
- సెక్షన్ వారీ మార్కులు
- మొత్తం మార్కులు (Total Score)
CTET 2026 ఫలితాలు త్వరలో విడుదల కానుండగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం మంచిది.ఫలితాలు వచ్చిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవడం అవసరం.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.