10వ తరగతి, ఇంటర్ అర్హతతో 2119 ప్రభుత్వ ఉద్యోగాలు, నోటిఫికేషన్ వివరాలు ఇవే
DSSSB 2025 లో కేవలం 10వ తరగతి / ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. జైల్ వార్డర్‌కు 1676 పోస్టులు , 6 నిమిషాల్లో 1.6 కిమీ పరుగెత్తడం తప్పనిసరి.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
DSSSB రిక్రూట్‌మెంట్ 2025(DSSSB Recruitment 2025): డిల్లీ ప్రభుత్వానికి చెందిన DSSSB 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2119 ఖాళీలకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు(DSSSB Recruitment 2025)ప్రకటించింది. ఇందులో 1676 జైల్ వార్డర్ పోస్టులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూలై 8 నుంచి ఆగస్టు 7, 2025 వరకు జరుగుతుంది. అభ్యర్థులు dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. విద్యార్హతలు పోస్టుల ప్రకారం భిన్నంగా ఉండగా, కొన్ని పోస్టులకు 10వ తరగతి/ఇంటర్/డిగ్రీ/డిప్లొమా అర్హతలు అవసరం. జైల్ వార్డర్ పోస్టులకు శారీరక పరీక్షలు, ఎగ్జామ్, మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి.
DSSSB 2025 ముఖ్యమైన విషయాలు(DSSSB 2025 Key Highlights)
- మొత్తం ఖాళీలు: 2119 పోస్టులు
- ప్రధాన పోస్టు: జైల్ వార్డర్ , 1676
- విద్యార్హతలు: 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ
- జైల్ వార్డర్ పరీక్ష: 6 నిమిషాల్లో 1.6 కిమీ పరుగెత్తాలి
- దరఖాస్తు తేదీలు: జూలై 8 నుండి ఆగస్టు 7, 2025
- అధికారిక వెబ్‌సైట్ dsssbonline.nic.in
- దరఖాస్తు ఫీజు: రూ.100 (SC/ST/మహిళలకు మినహాయింపు)ఆన్‌లైన్ పేమెంట్ విధానాలు మాత్రమే, ఫీజు రీఫండ్ ఉండదు
- జీతం రూ.21,700–రూ.69,100 (Pay Level-3)
DSSSB 2025 పోస్టుల ముఖ్యమైన తేదీలు (Important dates for DSSSB 2025 posts)
DSSSB నోటిఫికేషన్ 2025 ద్వారా విడుదలైన మొత్తం 2119 ఖాళీల్లో, వివిధ విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. వాటి అర్హతలు, ఖాళీలు ఈ కింది టేబుల్‌లో ఇవ్వబడ్డాయి
పోస్టు పేరు | ఖాళీలు | అర్హత |
జైల్ వార్డర్ (పురుషులు) | 1676 | 12వ తరగతి (ఇంటర్) |
మలేరియా ఇన్‌స్పెక్టర్ | 37 | 10వ తరగతి + సంబంధిత అనుభవం |
ఆయుర్వేద ఫార్మాసిస్ట్ | 8 | ఆయుర్వేద డిప్లొమా + అనుభవం |
PGT (భాషలు, సైన్స్ మొదలైనవి) | 148 | సంబంధిత PG డిగ్రీ + B.Ed |
OT/ICU టెక్నీషియన్ | 120 | ఇంటర్ + టెక్నీషియన్ ట్రైనింగ్ |
ల్యాబ్ టెక్నీషియన్ | 70 | సంబంధిత డిప్లొమా/అనుభవం |
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, వయస్సు పరిమితి తదితర వివరాలు గురించి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
DSSSB 2025 ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారు(How is the DSSSB 2025 selection process done?)
- పరీక్ష (Written Exam) , 200 మార్కులకు
- శారీరక పరీక్షలు (PET/PMT), జైల్ వార్డర్‌లకు
- డాక్యుమెంటు వెరిఫికేషన్
- మెడికల్ టెస్టు
DSSSB 2025 ముఖ్య విషయాలు (DSSSB 2025 Key points)
- అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోండి
- పరీక్షకు ముందు అడ్మిట్ కార్డు విడుదల చేయబడుతుంది
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్డేట్లు పరిశీలిస్తూ ఉండాలి
DSSSB రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా విడుదలైన 2119 పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.అర్హత ప్రమాణాలు ఎంతో సౌలభ్యంగా ఉండటంతో, విభిన్న విభాగాల నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 7, 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయడం మర్చిపోకండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.