ఆంధ్రప్రదేశ్‌లో DWCWEO తూర్పు గోదావరి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
తూర్పు గోదావరి DWCWEO కార్యాలయం ఔట్సోర్సింగ్ ఆధారంగా నాలుగు ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తూర్పు గోదావరి DWCWEO ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు (East Godavari DWCWEO Jobs Notification Details) : తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత కార్యాలయం (DWCWEO) తాజా నోటిఫికేషన్ ద్వారా జిల్లా మహిళా, శిశు సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రకటించింది. మొత్తం నాలుగు పోస్టులు,సైకో-సోషల్ కౌన్సిలర్, కేసు వర్కర్ మరియు మల్టీ పర్పస్ అసిస్టెంట్. ఈ నియామక ప్రక్రియలో ఉన్నాయి. మహిళల భద్రత, సంక్షేమం, చట్టపరమైన సహాయం, కౌన్సలింగ్ వంటి సేవలను బలోపేతం చేయడం ఈ నియామకాల ప్రధాన ఉద్దేశ్యం. దరఖాస్తులు పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే స్వీకరించబడతాయి. అభ్యర్థులు నిర్ణీత ఫారం నింపి, అవసరమైన విద్యాసర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు మరియు ఇతర డాక్యుమెంట్లను జతచేసి బొమ్మూరు మహిళా ప్రాంగణం కాంపౌండ్‌లోని DWCWEO కార్యాలయానికి సమర్పించాలి. దరఖాస్తుల చివరి తేదీ డిసెంబర్ 07,2025 ఆసక్తి ఉన్న వారు గడువులోగా ఫారం సమర్పించాలి.
DWCWEO తూర్పు గోదావరిలో మల్టీ పర్పస్ అసిస్టెంట్ సహా 4 ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ లింక్ (DWCWEO East Godavari Recruitment Notification Link for 4 Jobs Including Multi Purpose Assistant)
DWCWEO ఈ క్రింద పట్టికలో పోస్టుల వివరాలు అధికారిక నోటిఫికెేషన్ లింక్ ఇవ్వబడింది.
DWCWEO తూర్పు గోదావరిలో మల్టీ పర్పస్ అసిస్టెంట్ ఆఫ్‌లైన్ విధానం (Multi-Purpose Assistant Offline System in DWCWEO East Godavari)
ఈ క్రింది విధముగా అభ్యర్థులు పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
- నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తిగా నింపాలి.
- అవసరమైన విద్యాసర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు, అనుభవ పత్రాలు అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో జత చేయాలి.
- దరఖాస్తును కవర్‌లో ఉంచి బొమ్మూరు మహిళా ప్రాంగణం కాంపౌండ్‌లోని DWCWEO కార్యాలయానికి సమర్పించాలి.
- దరఖాస్తు గడువు డిసెంబర్ 7,2025 వరకు మాత్రమే స్వీకరించబడుతుంది.
- అసంపూర్ణ దరఖాస్తులు లేదా గడువు తర్వాత వచ్చినవి పరిగణలోకి తీసుకోబడవు.
- అభ్యర్థులు సమర్పించిన పత్రాల బాధ్యత స్వయంగా తప్పని సరిగా తీసుకోవాలి.
DWCWEO పోస్టుల అర్హతలు & జీతం వివరాలు (DWCWEO Posts Qualifications & Salary Details)
ఈ క్రింది విధముగా ప్రతి పోస్టుకు అవసరమైన అర్హతలు & జీతం వివరాలు ఉన్నాయి.
- సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.
- సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- పోస్టు ప్రకారం నెలవారీ జీతం రూ.13,000 నుండి రూ.20,000 మధ్య ఉంటుంది.
- ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌లో పేర్కొనబడ్డాయి
- అవసరమైన పత్రాలు పూర్తిగా లేకపోతే, దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
తూర్పు గోదావరి DWCWEO విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మహిళా మరియు శిశు సంక్షేమ సేవల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశంగా ఉంది. ఆసక్తి ఉన్న వారు అవసరమైన పత్రాలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
