EMRS అడ్మిట్ కార్డ్ 2025 విడుదల,పరీక్షా తేదీలు, ఖాళీలు & పూర్తి వివరాలు
EMRS అడ్మిట్ కార్డ్ 2025 విడుదలైంది, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి తమ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా హాల్‌లో ప్రవేశం కోసం అడ్మిట్ కార్డ్ & ఒక ప్రభుత్వ ఐడీ అవసరం.
EMRS అడ్మిట్ కార్డ్ 2025 విడుదల వివరాలు (EMRS Admit Card 2025 Release Details): EMRS ESSE 2025 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను NESTS అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7,267 బోధనా మరియు బోధనేతర పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు డిసెంబర్ 13, 14 మరియు 21న నిర్వహించబడతాయి. నమోదు చేసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి nests.tribal.gov.in లో లాగిన్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌లో వ్యక్తిగత వివరాలు, ఫోటో స్పష్టంగా ఉన్నాయో లేదో ఖచ్చితంగా తనిఖీ చేయండి. అడ్మిట్ కార్డ్ లేకుండా ఎవరిని కూడా పరీక్షా కేంద్రంలో ప్రవేశం ఉండదు మరియు పరీక్ష రోజున ఒక ప్రామాణిక ప్రభుత్వ ఐడి తప్పనిసరిగా తీసుకుని రావాలి.
ఈ నియామక ప్రక్రియలో ప్రిన్సిపాల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, మహిళా స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, JSA మరియు ల్యాబ్ అటెండెంట్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. EMRS పాఠశాలలు గిరిజన విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఉపాధ్యాయులు బోధనతో పాటు వసతి గృహ నిర్వహణ, పర్యవేక్షణ, సాహాయక పాఠ్య కార్యక్రమాల నిర్వహణ వంటి అదనపు బాధ్యతలు కూడా చేపట్టాలి. ఈ నేపథ్యంలో, అడ్మిట్ కార్డ్ విడుదల అయిన వెంటనే అభ్యర్థులు తమ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం చాలా అవసరం.
EMRS అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ (EMRS Admit Card 2025 Download Link)
ఈ క్రింద ఇచ్చిన అధికారిక లింక్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
EMRS అడ్మిట్ కార్డ్ 2025ను డౌన్‌లోడ్ చేసే పూర్తి విధానం (Complete procedure to download EMRS Admit Card 2025)
ఈ క్రింది సూచనలు పాటించి అభ్యర్థులు తమ EMRS 2025 అడ్మిట్ కార్డ్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేయవచ్చు.
- ముందు అభ్యర్థులు nests.tribal.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
- ఆ తరువాత హోమ్‌పేజీలో ఉన్న EMRS ESSE 2025 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.
- లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో కనిపించే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దాన్ని PDF గా డౌన్‌లోడ్ చేసి ప్రింట్ కాపీ తీసుకోండి.
- ప్రింట్‌లో ఫోటో, పేరు, పరీక్షా కేంద్రం వివరాలు సరైనవేనో లేదో తప్పకుండా తనిఖీ చేయండి.
EMRS 2025 ఖాళీల పూర్తి వివరాల పట్టిక (EMRS 2025 Vacancies Complete Details Table)
ఈ సంవత్సరం EMRS ESSE 2025 ద్వారా భర్తీ కావాల్సిన మొత్తం 7,267 పోస్టుల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
పోస్టులు | ఖాళీలు |
ప్రిన్సిపాల్ | 225 |
పీజీటీ (PGT | 1,460 |
టీజీటీ (TGT) | 3,962 |
మహిళా స్టాఫ్ నర్స్ | 550 |
హాస్టల్ వార్డెన్ | 635 |
అకౌంటెంట్ | 61 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) | 228 |
ల్యాబ్ అటెండంట్ | 146 |
మొత్తం | 7,267 |
EMRS 2025 హాల్ టికెట్ విడుదలైంది, అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు సిద్ధంగా ఉండాలి. పరీక్షా రోజున అడ్మిట్ కార్డ్ మరియు ఐడీ తీసుకెళ్లడం తప్పనిసరి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
