GATE 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగింపు
GATE 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఈ రోజు అక్టోబర్ 07 వరకు పొడిగించబడింది. లేటు ఫీజుతో రిజిస్టర్ కావాలంటే అక్టోబర్ 09, 2025 వరకు అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సంబంధిత పూర్తి సమాచారం ఇక్కడ అందించబడింది.
GATE 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ (GATE 2026 Registration Last Date): IIT గువాహటి GATE 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీని పొడిగించింది. అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండానే ఈరోజు, అక్టోబర్ 07,2025 రాత్రి వరకు దరఖాస్తు (GATE 2026 Registration Last Date) చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో రిజిస్టర్ కావాలనుకుంటే అక్టోబర్ 09,2025 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం ఫోటో, సంతకం, గుర్తింపు డాక్యుమెంట్, కేటగిరీ లేదా PwD సర్టిఫికేట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి: MCQs, MSQs, మరియు NAT. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫారం ఫిల్ చేయడం, ఫీజు చెల్లింపు, మరియు కన్‌ఫర్మేషన్ పేజీ డౌన్లోడ్ చేయడం వంటి అన్ని స్టెప్పులు పూర్తి చేసుకోవాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడగలరు.
GATE 2026 ముఖ్యమైన తేదీలు (GATE 2026 Important Dates)
GATE 2026 రిజిస్ట్రేషన్ మరియు పరీక్షల ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి
వివరాలు | తేదీలు |
సాధారణ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా) | అక్టోబర్ 07,2025 |
పొడిగించిన రిజిస్ట్రేషన్ చివరి తేదీ | అక్టోబర్ 09,2025 |
GATE 2026 పరీక్ష తేదీలు | ఫిబ్రవరి 07,08,14,15,2026 |
ఫలితాల విడుదల తేదీ | మార్చి 19,2026 |
GATE 2026 రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి (How to apply for GATE 2026 registration online)
అభ్యర్థులు ఈ క్రింద ఉన్న దశలను ఫాలో అవుతూ GATE 2026 కోసం రిజిస్ట్రేషన్(How to apply for GATE 2026 registration online) చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in సందర్శించండి
- హోమ్‌పేజీలోని Register లింక్ పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వివరాలు నమోదు చేయండి
- అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి, ఫీజు చెల్లించండి
- Submit పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోండి
- భవిష్యత్తు కోసం ప్రింట్ చేసుకోండి
GATE 2026 రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యూమెంట్స్ (Documents required for GATE 2026 registration)
GATE 2026 రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి:
- అభ్యర్థి ఫొటో (అవసరమైన ఫార్మాట్‌లో)
- అభ్యర్థి సంతకం (అవసరమైన ఫార్మాట్‌లో)
- సరైన ఫొటో ఐడెంటిటీ డాక్యుమెంట్ స్కాన్ కాపీ
- SC/ST అభ్యర్థులకు కేటగిరీ సర్టిఫికెట్ (PDF)
- UDID లేదా PwD సర్టిఫికెట్ (అవసరమైతే PDF)
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.