స్టేట్ బ్యాంక్ PO అడ్మిట్ కార్డ్ రిలీజ్‌కు సిద్ధం, డౌన్‌లోడ్ విధానం ఇదే
SBI PO 2025 అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల కానుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ sbi.co.in లో అందుబాటులో ఉంటుంది. SBI PO గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
SBI PO 2025 హాల్ టికెట్ త్వరలో విడుదల,డౌన్‌లోడ్ ప్రక్రియ, ముఖ్య సమాచారం ఇవే(SBI PO 2025 Hall Ticket to be released soon, download process, key information here): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్‌ను త్వరలో విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ అయిన sbi.co.in లోని Careers సెక్షన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పొందడానికి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఓ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష తేదీకి ముందు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు సరిచూసుకోవాలి. SBI PO పరీక్షకు సిద్ధంగా ఉండేందుకు అభ్యర్థులు సూచనలను పాటిస్తూ తగిన ప్రిపరేషన్ కొనసాగించాలి.
SBI PO 2025 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download SBI PO 2025 Admit Card?)
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి sbi.co.in వెళ్లండి
- ఆ తరువాత పై మెను లో "Careers" సెక్షన్ పై వెళ్లి “Current Openings” క్లిక్ చేయండి
- “SBI PO Recruitment 2025” లింక్‌ను ఎంచుకోండి
- “ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోండి” అనే లింక్ పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ / పుట్టిన తేదీ నమోదు చేయండి
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి
- హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది, డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
SBI PO 2025 పరీక్షల అంచనా షెడ్యూల్(SBI PO 2025 Exam Estimated Schedule)
SBI PO 2025 ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా జరుగుతుంది. దానికి సంబంధించిన అంచనా పరీక్ష తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి.
వివరాలు | తేదీలు |
ప్రిలిమ్స్ పరీక్ష | అక్టోబర్ 2025 |
మెయిన్స్ పరీక్ష | నవంబర్ 2025 |
ఇంటర్వ్యూలు / GD | డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 |
SBI PO 2025 అడ్మిట్ కార్డ్ లో ఉండే వివరాలు(Details in SBI PO 2025 Admit Card)
- అభ్యర్థి పేరు (Candidate's Name)
- రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్
- పుట్టిన తేదీ (Date of Birth)
- పరీక్ష తేదీ & సమయం (Exam Date & Time)
- పరీక్ష కేంద్రం పేరు & చిరునామా
- అభ్యర్థి ఫోటో
- అభ్యర్థి సంతకం
- పరీక్షకు సంబంధించిన సూచనలు (Exam Instructions)
- రిపోర్టింగ్ టైమ్ & గేట్ క్లోజింగ్ టైమ్
- దరఖాస్తు చేసిన పోస్టు వివరాలు (Post Applied For, Probationary Officer)
SBI PO 2025 ప్రిలిమినరీ పరీక్ష విధానం టైమ్ టేబుల్ & మార్కుల వివరణ(SBI PO 2025 Preliminary Exam Pattern Time Table & Marks Explanation)
SBI PO ప్రిలిమినరీ పరీక్ష అనేది తొలిదశ స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించబడుతుంది. ఇది ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు, 1 గంట వ్యవధితో మూడు విభాగాలలో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రతి సెక్షన్‌కు టైమ్ లిమిట్ ఉంటుంది.
విభాగం | ప్రశ్నల సంఖ్య | గరిష్ఠ మార్కులు | సమయం |
ఇంగ్లీష్ భాష | 30 | 30 | 20 నిముషాలు |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 | 35 | 20 నిముషాలు |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 నిముషాలు |
మొత్తం | 100 | 100 | 60 నిముషాలు |
SBI PO 2025 పరీక్షకు ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
- హాల్ టికెట్ లేకుండా ఎవరూ పరీక్షకు అనుమతించబడరు
- హాల్ టికెట్‌తో పాటు ఒక ఫోటో ID proof తీసుకెళ్లడం తప్పనిసరి (Aadhaar, PAN, Passport, etc.)
- హాల్ టికెట్‌లో ఉన్న అన్ని వివరాలు ముందుగానే చెక్ చేయాలి
- ఫోటో/సంతకం సరిగ్గా కనిపించకపోతే, సంబంధిత అధికారులను సంప్రదించాలి
- పరీక్ష కేంద్రానికి సమయానికి ముందే చేరుకోవాలి, గేట్ క్లోజింగ్ టైమ్‌ను తప్పనిసరిగా గమనించాలి
- హాల్ టికెట్‌పై ఉన్న సూచనలు జాగ్రత్తగా చదివి పాటించాలి
- సమయం మించిన ID cards లేదా పుట వాలిడ్ లేనివి ఉపయోగించరాదు
- తప్పులు ఉన్నట్లయితే,వెంటనే crpd@sbi.co.inకి మెయిల్ చేయాలి
SBI PO 2025 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ఉన్న సూచనలు జాగ్రత్తగా చదివి, అవసరమైన డాక్యుమెంట్లతో పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.