తెలంగాణ 10వ తరగతి మార్కుల మెమోలను ఎలా పొందాలి? (TS SSC Marks Memo 2025)
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ మార్కుల మెమోలను (TS SSC Marks Memo 2025) ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ 10వ తరగతి మార్కుల మెమో 2025 (TS SSC Marks Memo 2025) : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఈరోజు అంటే ఏప్రిల్ 30న విడుదలకానున్నాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు అంటే ఏప్రిల్ 30, 2025న మధ్యాహ్నం 1 గంటలకు TS SSC ఫలితాలు 2025ను ప్రకటిస్తుంది. తెలంగాణ బోర్డ్ 10వ తరగతి ఫలితాల తేదీ, సమయం అధికారికంగా ప్రకటించబడ్డాయి. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2025 ప్రకటించిన తర్వాత, TS SSC ఫలితం 2025 డైరెక్ట్ లింక్ bse.telangana.gov.inలో యాక్టివేట్ అవుతుంది. TS SSC ఫలితాలు 2025ను education.indianexpress.comలో కూడా చెక్ చేయవచ్చు. విద్యార్థులు విడుదలైన వెంటనే ఫలితాలను పొందడానికి మాతో నమోదు చేసుకోవచ్చు. TS SSC ఫలితం 2025 లాగిన్ విండోను కింద చూడవచ్చు.
తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చు. (TS SSC Results 2025 - Alternative websites)
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈ దిగువున తెలిపిన వెబ్‌సైట్‌లను ఓపెన్ చేసి చూడవచ్చు.- results.bsetelangana.org
- results.bse.telangana.gov.in
- bse.telangana.gov.in
TS SSC 2025 ఫలితాల స్పెషల్ న్యూస్...
తెలంగాణ SSC ఫలితాలు 2025: పాస్ మార్కులు
TS SSC విద్యార్థులు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పరీక్షలలో ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 35 శాతం కంటే తక్కువ స్కోర్ చేసిన విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరిగణించబడతారు.TS SSC మార్కుల మెమోని 2025 ఎలా పొందాలి? (How to Get TS SSC Marks memo 2025)
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ షార్ట్ మార్కుల మెమోని డైరెక్ట్‌గా అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. అయితే ఒరిజినల్ మార్కుల మెమోలని ఎలా పొందాలో ఇక్కడ వివరంగా అందించాం.- TS SSC 2025 ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి చూసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ నుంచి షార్ట్ మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అయితే ఒరిజినల్ మార్కుల మెమోలని విద్యార్థులు పాఠశాలల నుంచి మాత్రమే పొందాల్సి ఉంటుంది.
- దాని కోసం విద్యార్థులు తమ సంబంధిత పాఠశాలలకు వెళ్లి, ఒరిజనల్ 10వ తరగతి మార్కుల షీట్ కోసం అప్లై చేసుకోవాలి.
- స్కూల్ సిబ్బందికి మీ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ వంటి వివరాలు అందజేయాలి.
- అనంతరం స్కూల్ సిబ్బంది మీకు ఒరిజనల్ మార్కుల మెమోని అందజేయడం జరుగుతుంది.
తెలంగాణ SSC మార్క్స్ మెమోలో ఉండే వివరాలు (Details on Telangana SSC Marks Memo)
TS SSC మార్కుల మెమోలో పేర్కొన్న కింది వివరాలను విద్యార్థులు జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు:- రోల్ నెంబర్/ TS SSC హాల్ టికెట్ నంబర్
- అభ్యర్థి పేరు అతని/ఆమె తల్లిదండ్రుల పేరుతో పాటు
- బోధనా మాధ్యమం
- పరీక్ష సంవత్సరం
- గ్రేడ్
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.