IBPS క్లర్క్ 2025, 10,277 పోస్టులకు దరఖాస్తు ఈరోజే చివరి అవకాశం
IBPS క్లర్క్ 2025 కోసం 10,277 ఖాళీల భర్తీకి ఈరోజే చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఆగస్టు 21, 2025తో ముగుస్తుంది. ప్రీలిమ్స్ అక్టోబర్‌లో, మెయిన్స్ నవంబర్‌లో జరుగనున్నాయి.
IBPS క్లర్క్ 2025 భర్తీ, ముఖ్య వివరాలు, అర్హత, ఫీజు, పరీక్ష తేదీలు ,దరఖాస్తు విధానం (IBPS Clerk 2025 Recruitment, Key Details, Eligibility, Fee, Exam Dates, Application Procedure): IBPS క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) 2025 కోసం 10,277 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఈరోజుతోనే ముగుస్తుంది. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇప్పటివరకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ప్రీలిమ్స్ పరీక్షలు అక్టోబర్ 4, 5, 11 తేదీలలో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 29న జరగనున్నాయి. ఇంటర్వ్యూలు లేకుండా కేవలం ప్రీలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఫలితాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, OBC అభ్యర్థులకు ఫీజురూ.850 కాగా, SC/ST/PWD అభ్యర్థులకు రూ.175 మాత్రమే. ఆసక్తిగల వారు ibps.in వెబ్ సైట్ లోకి వెళ్లి CRP-CSA XV Apply Online లింక్ ద్వారా ఈరోజు ముగిసేలోపు దరఖాస్తు పూర్తి చేయాలి.
IBPS క్లర్క్ 2025 ముఖ్యమైన తేదీలు (IBPS Clerk 2025 Important Dates)
IBPS క్లర్క్ 2025 దరఖాస్తు, పరీక్షల టైమ్ టేబుల్ ని ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థులు అన్ని ముఖ్యమైన తేదీలను గమనించి ముందుగానే సిద్ధం కావాలి.
వివరాలు | తేదీలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 01, 2025 |
దరఖాస్తు చివరి తేదీ తేదీ | ఆగస్టు 21, 2025 (ఈరోజు) |
ప్రీలిమ్స్ పరీక్షల తేదీలు | అక్టోబర్ 4,5,11 2025 |
మెయిన్స్ పరీక్ష తేదీ | నవంబర్ 29, 2025 |
IBPS క్లర్క్ 2025 దరఖాస్తు ఎలా చేయాలి ? (How to apply for IBPS Clerk 2025)
IBPS క్లర్క్ 2025 గురించి ఈ క్రింది దశలు ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
- ముందుగా అభ్యర్థులు ibps.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- ఆ తరువాత “CRP-CSA XV Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి
- దరఖాస్తు ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
IBPS క్లర్క్ 2025 ముఖ్యమైన సూచనలు (IBPS Clerk 2025 Important Instructions)
IBPS క్లర్క్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తీసుకోవాలిసిన జాగ్రత్తలు.
- ఈరోజే (21 ఆగస్టు 2025) దరఖాస్తు చివరి తేదీ.
- ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం పెట్టుకోండి.
- ఫీజు చెల్లింపు విజయవంతమైందో లేదో ధృవీకరించండి.
- దరఖాస్తు వివరాలు సబ్మిట్ చేసే ముందు రెండుసార్లు తనిఖీ చేయండి.
- సర్వర్ స్లో అవుతుందని భావించి చివరి నిమిషానికి వాయిదా వేయవద్దు.
IBPS క్లర్క్ 2025 భర్తీకి ఆసక్తిగల అభ్యర్థులు ఈరోజే దరఖాస్తు పూర్తి చేయడం అత్యంత కీలకం. 10,277 ఖాళీల కోసం పోటీ తీవ్రమైనది కాబట్టి, చివరి సమయానికి ఆలస్యం కాకుండా అన్ని దశలను పూర్తి చేయండి. భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం సాధించడానికి ఈ అవకాశం మిస్ కాకూడదు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.