IGNOU జనవరి 2026 ఆన్‌లైన్ కోర్సులకు గడువు పెంపు , మార్చి 15 వరకు దరఖాస్తుకు అవకాశం
IGNOU జనవరి 2026 సెషన్ కు సంబంధించిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ల దరఖాస్తు గడువును మార్చి 15,2026 వరకు పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2026 సెషన్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ప్రోగ్రాం దరఖాస్తు గడువును అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు పొడిగించింది. ముందుగా ఫిబ్రవరి 28, 2026 అని నిర్ణయించగా, తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడుమార్చి 15, 2026 వరకుగా పొడిగించారు.ఈ గడువు పొడిగింపు కేవలం ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకే వర్తించబోతుందని, సర్టిఫికెట్ కోర్సులు మరియు సెమిస్టర్ ఆధారిత (ODL/రెగ్యులర్) ప్రోగ్రామ్‌లకు వర్తించదని IGNOU స్పష్టం చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేయలేని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా తమ దరఖాస్తు సమర్పించవచ్చు. యూనివర్సిటీ సూచన ప్రకారం, చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసి అప్లికేషన్ ఫీజు చెల్లిస్తూ దరఖాస్తును పూర్తి చేసుకోవాలని ఉద్దేశించింది. ముందుగానే అప్లై చేయడం వల్ల సాంకేతిక సమస్యలు లేదా ఆలస్యాలు నివారించవచ్చు అని అధికారులు సూచించారు.
IGNOU అండర్ గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు (జనవరి 2026) (IGNOU Undergraduate & Postgraduate Programmes (January 2026))
IGNOU జనవరి 2026 సెషన్‌లో వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ కోర్సులు ఈ క్రింది విధముగా అందుబాటులో ఉన్నాయి.
స్థాయి | కోర్సు పేరు | వివరాలు/ స్పెషలైజేషన్లు |
అండర్ గ్రాడ్యుయేట్ | బీఏ (BA) | వివిధ ఆర్ట్స్ విభాగాలు |
అండర్ గ్రాడ్యుయేట్ | బీబీఏ (BBA) | బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ |
అండర్ గ్రాడ్యుయేట్ | బీకామ్ (BCOM) | కామర్స్ & అకౌంటింగ్ |
అండర్ గ్రాడ్యుయేట్ | బీసీఏ (BCA) | కంప్యూటర్ అప్లికేషన్స్ |
అండర్ గ్రాడ్యుయేట్ | బీఎస్సీ (BSC) | సైన్స్ స్ట్రీమ్స్ |
అండర్ గ్రాడ్యుయేట్ | బీఎస్‌డబ్ల్యూయూ (BSW) | సోషల్ వర్క్ |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | ఎంబీఏ (MBA) | వివిధ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | ఎంఏ (MA) | వివిధ ఆర్ట్స్ స్పెషలైజేషన్లు |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | ఎంసీఏ (MCA) | కంప్యూటర్ అప్లికేషన్స్ |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | ఎంకామ్ (MCOM) | అడ్వాన్స్‌డ్ కామర్స్ |
IGNOU దరఖాస్తుకు అవసరమైన పత్రాలు (Documents required for IGNOU application)
IGNOU ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందు ఈ క్రింది పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
- స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (100 KB లోపు)
- స్కాన్ చేసిన సంతకం (100 KB లోపు)
- విద్యార్హత సర్టిఫికెట్ స్కాన్ కాపీ (200 KB లోపు)
- అనుభవ ధృవపత్రం (ఉంటె — 200 KB లోపు)
- కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC అభ్యర్థులకు — 200 KB లోపు)
IGNOU ఆన్‌లైన్ కోర్సులకు ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for IGNOU online courses?)
IGNOU జనవరి 2026 ఆన్‌లైన్ కోర్సుల దరఖాస్తు పూర్తిగా ఈ క్రింది పద్ధతిలో ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
- ముందుగా అభ్యర్థులు gnouadmission.samarth.edu.in వెబ్‌సైట్‌కు వెళ్లండి
- హోమ్‌పేజీలోని New Registration లింక్‌పై క్లిక్ చేయండి
- ప్రాథమిక వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
- యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపాలి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
- ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి
మొత్తానికి IGNOU జనవరి 2026 ఆన్‌లైన్ ప్రోగ్రామ్ లకు గడువు పొడిగించడం అభ్యర్థులకు మంచి అవకాశంగా నిలిచింది. అర్హులైన వారు చివరి తేదీకి ముందు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.