IIIT బాసర్ ఎంపిక జాబితా 2025 ఎప్పుడు విడుదలవుతుంది?మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా విశ్లేషణ
మునుపటి సంవత్సరాల ట్రెండ్స్ ప్రకారం, IIIT బాసర్ సెలెక్షన్ లిస్ట్ 2025 మధ్యాహ్నం సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక ఎంపిక జాబితా జూలై 4, 2025న విడుదల చేయబడుతుంది.
IIIT బాసర్ సెలెక్షన్ లిస్ట్ 2025 అంచనా విడుదల సమయం(IIIT Basar Selection List 2025 Expected Release Time): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థుల కోసం IIIT బాసర్ 2025 తాత్కాలిక ఎంపిక జాబితాను జూలై 4, 2025న విడుదల (IIIT Basar Selection List 2025 Expected Release Time)చేయనుంది. అభ్యర్థులు IIIT బాసర్ సెలెక్షన్ లిస్ట్ 2025ను అధికారిక వెబ్‌సైట్ అయిన rgukt.ac.in లో చెక్ చేసుకోవచ్చు.అధికారిక విడుదల సమయాన్ని ప్రకటించనప్పటికీ, గత సంవత్సరాల ప్రకారం ఇది మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. కొంత ఆలస్యం అయితే సాయంత్రం 6 గంటల వరకు జాబితా విడుదల కావచ్చు.ఈ సెలెక్షన్ లిస్ట్ అభ్యర్థుల 10వ తరగతి గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (GPA) ,వారి రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా తయారు చేయబడుతుంది. తాత్కాలిక ఎంపిక జాబితాలో చోటు పొందిన అభ్యర్థులకే RGUKT బాసర్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ జూలై 7, 2025న ప్రారంభం కానుంది.
IIIT బాసర్ సెలెక్షన్ లిస్ట్ 2025 అంచనా విడుదల సమయం(IIIT Basar Selection List 2025 Expected Release Time)
మునుపటి సంవత్సరాల ప్రకారం తాత్కాలిక ఎంపిక జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందో ఇక్కడ క్రింద టేబుల్ పట్టికలో అంచనా(IIIT Basar Selection List 2025 Expected Release Time)ఇచ్చాము చూడండి.
వివరాలు | తేదీలు |
ప్రత్యేక వర్గాలు కాకుండా తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటన తేదీ | జులై 04,2025 |
IIIT బాసర్ ఎంపిక జాబితా 2025 అంచనా విడుదల సమయం | మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య |
అనుకోని ఆలస్యం జరిగితే సమయం | సాయంత్రం 6 గంటల నాటికి |
6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో అడ్మిషన్ పొందేందుకు, అభ్యర్థులు తమ దరఖాస్తులో ఇచ్చిన సమాచారం నిజమైనదేనా అనే విషయాన్ని అసలు ధ్రువపత్రాలతో సరిపోల్చి నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ సమయంలో ఏవైనా అసమానతలు కనిపిస్తే, అడ్మిషన్ కమిటీ ఆ ప్రవేశాన్ని రద్దు చేసే హక్కును కలిగి ఉంటుంది.ప్రథమ సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ. 37,000 కాగా, దీనిలో రూ. 1,000 పరీక్ష ఫీజు కూడా కలిసే ఉంటుంది. అదనంగా విద్యార్థులు రూ. 1,000 (SC/ST కోసం రూ. 500) రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 2,000 రిఫండబుల్ కాషన్ డిపాజిట్, సుమారు రూ. 700 మెడికల్ ఇన్షూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.