TG SET 2025 ఎగ్జామ్ సెంటర్ల విషయంలో ఈ మార్పు అవసరమా?
TG SET 2025 పరీక్షలు డిసెంబర్ 22 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వేళ అభ్యర్థులు తాము ఎంచుకున్న పరీక్ష కేంద్రానికి చేరుకునే స్థితి లేకపోతే అప్పుడు తమకు దగ్గరగా ఉండే పరీక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం ఉందా? లేదా అనే విషయాన్ని ఇక్కడ తెలియజేసాం.
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం TG SET 2025ని ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తుంది. అంటే మూడు రోజుల పాటు TG SET జరగనుంది. రెండు షిప్టుల్లో ఈ పరీక్షను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రోజుల్లో TG SET హాల్ టికెట్లు కూడా రిలీజ్ కానున్నాయి. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరాలు, జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. పరీక్షా కేంద్రాలకు జాబితాల అధికారిక telanganaset.orgలో ఉంది. అలాగే తమకు దగ్గరగా ఉండే పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎంచుకుని ఉండి ఉంటారు. హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం వివరాలు ప్రింట్ చేయబడుతుంది. ఒక వేళ అభ్యర్థులు తాము ఎంచుకున్న పరీక్ష కేంద్రానికి చేరుకునే స్థితి లేకపోతే అప్పుడు తమకు దగ్గరగా ఉండే పరీక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం ఉందా? లేదా? అనే సందేహానికి ఇక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాం.
ఇది కూడా చూడండి: మీరు TG SET 2025 ఎగ్జామ్‌కి లేట్ అయితే ఏం జరుతుంగుది?
TG SET 2025 Examination Centers (TG SET 2025 ఎగ్జామ్ సెంటర్లు)
తెలంగాణాలోని ప్రధాన జిల్లాలో, నగరాల్లో TG SET 2025 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10 సెంటర్లలో TG SET 2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.సంఖ్య | ప్రాంతీయ కేంద్రం | సంఖ్య | ప్రాంతీయ కేంద్రం |
|---|---|---|---|
1. | ఆదిలాబాద్ | 6 | నిజామాబాద్ |
2 | హైదరాబాద్ | 7 | వరంగల్ |
3 | కరీంనగర్ | 8 | ఖమ్మం |
4 | మహబూబ్ నగర్ | 9 | మెదక్ |
5 | నల్గొండ | 10 | రంగారెడ్డి |
అభ్యర్థులు ఎంచుకున్న సెంటర్ కాకుండా వేరే సెంటర్‌లో TG SET 2025 పరీక్ష రాయవచ్చా?
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కచ్చితంగా తాము ఏ సెంటర్‌లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో.. ఆ సమాచారాన్ని అందించి ఉండాలి. దాని ఆధారంగా అభ్యర్థులకు అధికారులు సెంటర్‌ను కేటాయించడం జరుగుతుంది. ఆ సెంటర్ వివరాలు హాల్ టికెట్లో ప్రింట్ చేయబడుతుంది. అయితే ఒక్కోసారి అభ్యర్థులు తాము ఎంచుకున్న సెంటర్‌కు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పాడుతుంది. ఆ సమయంలో వేరే సెంటర్‌లో TG SET 2025ని రాసేందుకు అవకాశం ఉండదు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై వారికి కేటాయించిన పరీక్షా కేంద్రంలో కాకుండా మరే ఇతర పరీక్షా కేంద్రంలో హాజరవ్వడానికి అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించబడవని అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా ప్రకటించారు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలే కొనసాగుతాయి.TG SET 2025 ఎగ్జామ్ సెంటర్ల విషయంలో ఈ మార్పు అవసరమా?
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. దరఖాస్తు సమయంలో తమకు దగ్గరగా ఉండే సెంటర్‌ను ఎంపిక చేసుకున్నా తర్వాత పరీక్ష సమయానికి వారు ఆ సెంటర్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో పరీక్ష కోసం తాము ముందుగా ఇచ్చిన సెంటర్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలు వాయిదా పడినా, పరీక్ష క్యాన్సిల్ అయి మళ్లీ కొత్త తేదీలు ప్రకటించే సమయంలో అభ్యర్థుల్లో ఈ గందరగోళం ఏర్పడుతుంది. TG SET 2025 కూడా ముందు ప్రకటించిన తేదీల్లో కాకుండా వాయిదా పడింది. అయితే ఈ మేరకు అభ్యర్థులు కొంతమంది ఎగ్జామ్ సెంటర్ విషయంలో వెసులుబాటు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతుంటారు. కానీ అధికారులు మాత్రం ఎగ్జామ్ సెంటర్ విషయంలో ఈ నిబంధన చాలా అవసరమని, అప్పుడే ఎక్కడ ఎంతమంది రాస్తున్నారు, ఎంత ఎక్వీప్‌మెంట్‌ని ఏర్పాటు చేయాలనేది సరిగ్గా నిర్వహింబడుతుందని అంటున్నారు.Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
