JoSAA రెండవ మాక్ కేటాయింపు 2025 ఈరోజు విడుదల, జూన్ 12 వరకు ఎంపికలను సవరించండి
JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాలు జూన్ 11న విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఆప్షన్లు జూన్ 12 సాయంత్రం 5 గంటల వరకు సవరించుకోవచ్చు. ఇది మీ తుది ఎంపికకు ముందు తాత్కాలిక గైడ్‌గా ఉంటుంది.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
JoSAA రెండవ మాక్ కేటాయింపు 2025 ఈరోజు విడుదల, జూన్ 12 వరకు ఎంపికలను సవరించండి(JoSAA Second Mock Allotment 2025 Released Today, Edit Options Till June 12): జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(JoSAA) 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాలు జూన్ 11, 2025 న విడుదలయ్యాయి. ఈ మాక్ రౌండ్ ఫలితాలు విద్యార్థులు ఇప్పటివరకు ఇచ్చిన కోర్స్, ఇన్‌స్టిట్యూట్ ఎంపికల ఆధారంగా తాత్కాలికంగా సీటు(JoSAA Second Mock Allotment 2025 Released Today, Edit Options Till June 12)కేటాయింపులను చూపుతాయి. ఇది ఫైనల్ కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థులకు ఒక స్పష్టతను ఇవ్వడం కోసం ఉద్దేశించబడింది. విద్యార్థులు ఈ ఫలితాలను పరిశీలించి, అవసరమైతే తమ ఎంపికలను జూన్ 12 సాయంత్రం 5 గంటల లోపు సవరించుకోవచ్చు. సవరించిన ఆప్షన్ల ప్రకారమే తర్వాత అసలైన రౌండ్లు నిర్వహించబడతాయి. కావున విద్యార్థులు వీలైనంత త్వరగా JoSAA అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మాక్ ఫలితాలు చెక్ చేసుకుని, సరికొత్త ఆప్షన్లు అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం. రౌండ్ -1 అసలైన సీటు కేటాయింపు ఫలితాలు జూన్ 14న విడుదల కానున్నాయి.
JoSAA 2025,ఆప్షన్లు మార్చుకునే చివరి అవకాశం, జూన్ 12 వరకు మాత్రమే(JoSAA 2025: Last chance to change options, only till June 12)
- ఎడిటింగ్ చివరి తేది,జూన్ 12, 2025 సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే చాయిస్‌లను ఎడిట్ చేయగలరు.
- మాక్-2 ఫలితాలను పరిశీలించిన తర్వాత, మీరు మీ ప్రాధాన్యాలను మార్చుకోవచ్చు.
- మీరు ఎడిట్ చేసిన తరువాత లాక్ చేయకపోతే, జూన్ 12 సాయంత్రం తర్వాత చివరిసారి సేవ్ చేసిన ఆప్షన్లే ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి.
- ఒకసారి ఆప్షన్లు లాక్ అయిన తరువాత ఎటువంటి మార్పులు చేసుకునే అవకాశం ఉండదు.
- జూన్ 14న రాబోయే రౌండ్-1 సీటు కేటాయింపు ఫలితాలు, మీరు ఫైనల్‌గా ఇచ్చిన ఆప్షన్‌ల ఆధారంగా ఉంటాయి.
JoSAA 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ & ముఖ్యమైన తేదీలు(JoSAA 2025 Counselling Schedule & Important Dates)
JoSAA 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ & ముఖ్యమైన తేదీలు గురించి ఈ క్రింది టేబుల్ పట్టికలో ఇచ్చాము .
వివరాలు | తేదీలు |
Mock ఆలోట్‌మెంట్-2 విడుదల తేదీ | జూన్ 11,2025 |
ఆప్షన్‌ల లాక్ & అంగీకార రుసుము | జూన్ 12, 2025 సాయంత్రం 5:00 గంటలు |
రౌండ్-1 అసలు సీటు కేటాయింపు | జూన్ 14,2025 |
మొత్తంగా, JoSAA 2025 రెండవ మాక్ కేటాయింపు ఫలితాలు విద్యార్థులకు తమ ఎంపికలపై స్పష్టతను ఇవ్వడంలో సహాయపడతాయి. అభ్యర్థులు ఈ ఫలితాల ఆధారంగా తమ ఆప్షన్లు సమీక్షించి, అవసరమైతే మార్చుకొని జూన్ 12 సాయంత్రం 5 గంటల లోపు లాక్ చేయాలి. ఇది తుది సీటు కేటాయింపులకు కీలకంగా మారుతుంది. సరిగ్గా ప్లాన్ చేసుకొని, సమయానికి అన్ని చర్యలు తీసుకుంటే, ఇష్టమైన కోర్సు ,ఇన్‌స్టిట్యూట్‌లో సీటు పొందే అవకాశాలు పెరుగుతాయి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.