TS ICETలో 10000 ర్యాంక్‌ను అంగీకరించే MBA కళాశాలల లిస్ట్
TS ICET 2025లో 10 వేల ర్యాంకు వచ్చిందా? అయితే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చే ఛాన్స్ ఉందో ఇక్కడ తెలుసుకోండి. గత ట్రెండ్స్‌ను అనుసరించి ఇక్కడ కాలేజీల జాబితా అందించాం.
TS ICET 2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తమకు ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందో? చెక్ చేసుకుంటుంటారు. రాష్ట్రంలో MBA, MCAలో అడ్మిషన్లు పొంది ఆయా కోర్సుల్లో విద్యనభ్యసించేందుకు అభ్యర్థుల కోసం మంచి కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో MBA అడ్మిషన్లకు కీలకమైన TS ICET ర్యాంకులు ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో సీటు లభిస్తుంది. అయితే 10,000 ర్యాంక్ లోపు అభ్యర్థులు తెలంగాణలోని కొన్ని అగ్రశ్రేణి కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు కొన్ని మంచి కళాశాలల్లో కూడా ప్రవేశం పొందవచ్చు. TS ICET 2025లో 10,000 ర్యాంకు సాధించిన అభ్యర్థులకు ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే ఛాన్స్ ఉంటుందో? ఇక్కడ అందించాం. గతంలో కాలేజీలో కటాఫ్ ర్యాంకులు ఆధారంగా 10 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులకు ఏ కాలేజీలు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉందో ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాది వాస్తవ ర్యాంకుల ఆధారంగా మరిన్ని కాలేజీల్లో అవకాశాలు పెరగొచ్చు, తగ్గొచ్చు.
ఇది కూడా చూడండి:
TS ICET కనీస అర్హత మార్కులు 2025 ఎంత?
TS ICETలో 10000 ర్యాంక్‌ను అంగీకరించే MBA కళాశాలల జాబితా (List of MBA Colleges Accepting Rank 10000 in TS ICET)
TS ICET ర్యాంక్ వారీ కళాశాలల జాబితా 2025 దిగువున ఇచ్చిన క్రింది ట్టికను చెక్ చేయండి. ఈ కళాశాలలు తెలంగాణలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్నాయి, వీటిలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), ఉస్మానియా యూనివర్సిటీ (OU),కాకతీయ యూనివర్సిటీ (KU) ఉన్నాయి.
కళాశాల పేరు | ఆమోదించబడిన TS ICET ర్యాంక్ |
MC గుప్త కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, నల్లకుంట | 10,000 వరకు |
భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహింపట్నం | 10,000 వరకు |
CMR టెక్నికల్ క్యాంపస్ (స్వయంప్రతిపత్తి) | 10,200 వరకు |
గీతంజలి ఇంజనీరింగ్, సాంకేతిక కళాశాల (స్వయంప్రతిపత్తి) | 10,200 వరకు |
మ్యాన్‌పవర్ డెవలప్‌మెంట్ కాలేజ్ - సెల్ఫ్ ఫైనాన్స్, మౌలాలి | 10,300 వరకు |
వి.వి.సంఘ్స్ బసవేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్ | 10,500 వరకు |
శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, తిమ్మాపూర్ | 10,500 వరకు |
అరోరస్ PG కళాశాల, రామంతపూర్ | 11,500- 12500 |
పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్, కొల్లాపూర్ | 10,500 - 11,000 |
ఎస్ఎల్సిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్, హయత్ నగర్ | 11,000 - 11,500 |
నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్ | 11,500- 12,000 |
బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MGMT సైన్స్ | 11500 - 12000 |
అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్, బాటసింగారం | 11000 - 11500 |
సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కండ్లకోయ | 12,500 - 13,000 |
అన్నామాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ | 13,000 - 13,500 |
అవంతి పీజీ కాలేజ్, ముసరంబాగ్ | 13,000-13500 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.