NIT రాయపూర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ వర్కర్ ఖాళీలు, నవంబర్ 28లోపు దరఖాస్తు చేయండి
NIT రాయపూర్‌లో ఫీల్డ్ వర్కర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 28లోగా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
NIT రాయ్‌పూర్ డేటా ఎంట్రీ ఖాళీల వివరాలు (NIT Raipur Data Entry Vacancies Details): NIT రాయపూర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి . 6 ఫీల్డ్ వర్కర్లు మరియు 1 డేటా ఎంట్రీ ఆపరేటర్. దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులు కావాలి. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌పై పరిజ్ఞానం ఉండటం ముఖ్య అర్హతగా పేర్కొంటున్నారు. పని స్వభావం ప్రకారం ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు మరియు ఫీల్డ్ వర్క్‌కు సంబంధించిన బేసిక్ అవగాహన ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అందిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తదుపరి దశకు ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.20,000 జీతం అందజేయబడుతుంది. దరఖాస్తు పూర్తి విధానం ఈమెయిల్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ బయోడేటా మరియు అవసరమైన పత్రాలను ఈమెయిల్ కు పంపాలి. దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 28,2025. తర్వాత ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది, అర్హులైనవారికి ఇంటర్వ్యూ వివరాలు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. తక్కువ అర్హతలతో మంచి జీతం మరియు సులభమైన అప్లికేషన్ ప్రక్రియ కారణంగా ఇది మంచి అవకాశంగా ఉంటుంది.
NIT రాయ్‌పూర్ డేటా ఎంట్రీ అధికారిక లింక్ (NIT Raipur Data Entry Official Link)
ఈ క్రింద ఇచ్చిన ఈమెయిల్ అధికారిక లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా పంపవచ్చు.
NIT రాయ్‌పూర్ డేటా ఎంట్రీ దరఖాస్తు విధానం (NIT Raipur Data Entry Application Procedure)
NIT రాయ్‌పూర్ డేటా ఎంట్రీ దరఖాస్తు పూర్తి స్థాయిలో ఈమెయిల్ ద్వారా పంపాలి.
- ముందుగా అభ్యర్థులు బయోడేటా (CV/Resume) సిద్ధం చేసుకోవాలి.
- ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, Microsoft Office నైపుణ్య సర్టిఫికేట్ (ఉంటే), ఇతర అర్హత పత్రాలు స్కాన్ చేయాలి.
- ఐడీ ప్రూఫ్ (ఆధార్/పాన్/వోటర్ ఐడి) జత చేయాలి.
- అన్ని పత్రాలను ఒకే PDF లేదా ZIP ఫైల్‌లో సమీకరించాలి.
- ఈ ఫైల్‌ను అధికారిక ఈమెయిల్‌కు pavanmishra.it@nitrr.ac.in పంపాలి:
- ఈమెయిల్ Subject లో దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును స్పష్టంగా నమోదు చేయాలి.
- దరఖాస్తు చివరి తేదీ, నవంబర్ 28,2025.
NIT రాయపూర్ విడుదల చేసిన ఈ ఖాళీలు ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాసం. దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉండటం వల్ల ఆసక్తి ఉన్నవారు చివరి తేదికి ముందు అప్లై చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.