NTRUHS నుంచి పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ రెండేళ్ల కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
NTRUHS నుంచి పోస్ట్ బేసిక్ BSc (నర్సింగ్) రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరడం జరిగింది. సంబంధిత వివరాలు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
NTRUHS పోస్ట్ బేసిక్ BSC నర్సింగ్ 2YD కోర్సు నోటిఫికేషన్ 2025 (NTRUHS Post Basic B.Sc.(Nursing) 2 YD Course Notification 2025) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ బేసిక్ BSc (నర్సింగ్) రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరడం జరిగింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్కాన్ చేసిన సర్టిఫికెట్ల అప్‌లోడ్ కోసం పూర్తి షెడ్యూల్, వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 18, 2025 ఉదయం 11 గంటల నుంచి ఆగస్ట్ 22, 2025న సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఆగస్ట్ 25న ఉదయం 08.00 గంటల నుంచి 31.08.2025న సాయంత్రం 7.00 గంటల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక కారణాల వల్ల అభ్యర్థులు 22.08.2025 రాత్రి 09.00 గంటల నుండి 24.08.2025 రాత్రి 09.00 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు లభ్యత అందుబాటులో ఉండదని గమనించాలి. అలాగే పురుష, స్త్రీ అభ్యర్థులు ఇద్దరూ పోస్ట్ బేసిక్ BSc (నర్సింగ్) 2 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులు.
NTRUHS పోస్ట్ బేసిక్ BSC నర్సింగ్ రెండేళ్ల కోర్సు నోటిఫికేషన్ 2025
ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి PDF నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెండేళ్ల పోస్ట్ బేసిక్ B.SC నర్సింగ్ కోర్సుకు అర్హత ప్రమాణాలు (Eligibility for Post Basic B.Sc.(Nursing) 2-YD Course)
రెండేళ్ల పోస్ట్ బేసిక్ B.SC నర్సింగ్ కోర్సు కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు భారత జాతీయులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIO)/భారతదేశ విదేశీ పౌరుడు (OCI) కార్డుదారులు లేదా విదేశీ పౌరులై ఉండాలి. PIOలు, OCI కార్డుదారులు, విదేశీ జాతీయులు పోస్ట్ బేసిక్ B.Sc.(నర్సింగ్) 2YD కోర్సులో ప్రవేశం కోసం నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/AIU, న్యూఢిల్లీ నుంచి అభ్యంతర ధ్రువీకరణ పత్రాలను సబ్మిట్ చేయాలి.
ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయం లేదా ఇంటర్మీడియట్ విద్య బోర్డు లేదా NIOS లేదా APOSS ద్వారా గుర్తించబడిన ఏదైనా ఇతర సమానమైన పరీక్ష (10+2 నమూనా)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భారత నర్సింగ్ కౌన్సిల్ గుర్తించిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో ఉత్తీర్ణులై ఉండాలి.
రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.
అభ్యర్థి వయస్సు 31.12.2025 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పోస్ట్ బేసిక్ BSC (నర్సింగ్) 2 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు గరిష్ట వయో పరిమితి లేదు.
పోస్ట్ బేసిక్ BSC (నర్సింగ్) దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు (Post Basic B.Sc (Nursing) Application and Processing Fee)
పోస్ట్ బేసిక్ BSC (నర్సింగ్) దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు వివరాలు ఈ దిగువున అందించాం.
కేటగిరి | ఫీజువు వివరాలు |
OC అభ్యర్థులు | రూ.2360 (రూ.2000 నుంచి GST రూ.360లు) |
BC/SC/ST అభ్యర్థులు | రూ.1888లు (రూ.1600 నుంచి GST రూ.288) |
ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తుదారులు చెల్లించిన ఫీజు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు.అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ drntr.uhsap.inలో అందుబాటులో ఉన్న కోర్సు వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి సూచనలను డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.