ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యలో MBA /MCA ప్రవేశాలు 2025-26
ఉస్మానియా యూనివర్శిటీ OUCDE 2025-26 MBA , MCA కోర్సుల కోసం దూరవిద్యలో ప్రవేశాలను ప్రకటించింది.ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా గణిత సబ్జెక్ట్ ఉన్న అభ్యర్థులు అర్హత పొందుతారు.దరఖాస్తులు ఆగస్టు 15, 2025 నుండి సెప్టెంబర్ 02, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించబడతాయి.
OUCDE ద్వారా 2025-26 MBA /MCA కోర్సులకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం (Online applications for 2025-26 MBA/MCA courses through OUCDE Begin): ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జి. రాత్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (OUCDE) 2025-26 విద్యా సంవత్సరానికి MBA ,MCA కోర్సుల కోసం ప్రవేశాలను ప్రకటించింది.ఈ కోర్సులు మొత్తం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. MBA కోర్సులో ప్రవేశానికి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు, కాగా MCA కోర్సులో ప్రవేశానికి గణితం సబ్జెక్టుగా ఉన్న డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హత అవసరం. సాధారణ ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు, అయితే TG/ICET-2025లో అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 15, 2025న ప్రారంభమై, సెప్టెంబర్ 02, 2025లో ముగుస్తాయి. ఆలస్య రుసుముతో రూ.500 దరఖాస్తులు సెప్టెంబర్ 05, 2025 వరకు స్వీకరించబడతాయి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్07, 2025న నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.oucde.net ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. ఈ విధంగా, ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యను ఎంచుకునే అభ్యర్థులకు సులభంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
OU యూనివర్శిటీ దూరవిద్య ప్రేవేశానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? (How to apply for OU University Distance Learning Admission?)
ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యలో MBA /MCA కోర్సులకు దరఖాస్తు చేయడం కోసం , అభ్యర్థులు ఈ కింది విధంగా పాటించాల్సి ఉంటుంది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.oucde.net ను సందర్శించండి.
- ఆ తరువాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ను తెరవండి.
- వ్యక్తిగత, విద్యాసంబంధిత ,సంప్రదింపు వివరాలను స్పష్టంగా, సరైనగా నమోదు చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
- ఫారం సబ్మిట్ చేసిన తర్వాత చెల్లింపు రూ.500 లేదా ఆలస్య రుసుము తో రూ.500 పూర్తి చేయండి.
- దరఖాస్తు సమర్పణకు సంబంధించిన కన్ఫర్మేషన్ ను డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు కోసం భద్రపరచుకోండి.
OU యూనివర్శిటీ దూరవిద్య ప్రేవేశానికి అవసరమైన డాక్యుమెంట్స్ (Documents required for OU University Distance Learning Admission)
MBA /MCA కోర్సుల కోసం దరఖాస్తు చేసేప్పుడు ఈ డాక్యుమెంట్స్ అవసరం.
- గుర్తింపు కార్డు (Aadhaar Card / Voter ID / Passport).
- అర్హత సర్టిఫికేట్ (బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్).
- TG/ICET-2025 అర్హత సర్టిఫికేట్.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం కాపీ లేదా కన్ఫర్మేషన్ పేజ్.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
- ఇతర అవసరమయిన సపోర్ట్ డాక్యుమెంట్స్.
ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యలో MBA /MCA కోర్సులు, ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ మరియు తేదీలను గమనించి దరఖాస్తు చేయవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.