కాంట్రాక్ట్ ప్రాతిపదికన కడప, నెల్లూరు జైళ్లలో ఉద్యోగాలు, మంచి వేతనం, ఇలా అప్లై చేసుకోండి
కాంట్రాక్ట్ ప్రాతిపదికన కడప, నెల్లూరు జైళ్లలో (Prisons Department Kadapa and Nellore Recruitment 2025) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ దిగువున అందించాం.
జైళ్ల శాఖ కడప, నెల్లూరు నియామకాలు 2025 (Prisons Department Kadapa and Nellore Recruitment 2025) : ఏపీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ప్రకటన ప్రకారం మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్ట్ 25వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, నర్స్ వంటి వివిధ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్, BSC, GNM ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తు 25-08-2025న ప్రారంభమవుతుంది. 07-09-2025న క్లోజ్ అవుతుంది. మరిన్న వివరాలకు అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌కి kadapa.ap.gov.in వెళ్లి చూడొచ్చు.
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025 పోస్టులు (Prisons Department Kadapa and Nellore Recruitment 2025 Posts)
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025 పోస్టుల వివరాలు ఈ దిగువున పట్టికలో అందించాం.
పోస్ట్ పేరు | మొత్తం |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ | 02 |
అకౌంటెంట్ కమ్ క్లార్క్ (పార్ట్ టైమ్) | 02 |
కౌన్సెలర్, సామాజిక కార్యకర్త, మనస్తత్వవేత్త, సమాజ కార్యకర్త. | 04 |
నర్స్ (పురుషుడు) | 02 |
వార్డ్ బాయ్ | 02 |
PEER అధ్యాపకుడు | 02 |
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి (Prisons Department Kadapa and Nellore Recruitment 2025 Age Limit)
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025కు కావాల్సిన వయోపరిమితి వివరాలు ఈ దిగువున అందించాం.కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025 జీతం వివరాలు (Prisons Department Kadapa and Nellore Recruitment 2025 Salary)
జైళ్ల శాఖ కడప, నెల్లూరు రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల జీతం వివరాలు ఈ దిగువున అందించిన విధంగా ఉంటాయి.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: నెలవారీ గౌరవ వేతనం రూ.30,000లు
అకౌంటెంట్ కమ్ క్లార్క్ (పార్ట్ టైమ్): నెలవారీ గౌరవ వేతనం రూ.18,000
కౌన్సెలర్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, కమ్యూనిటీ వర్కర్: నెలవారీ గౌరవ వేతనం రూ.25,000లు
నర్స్ (పురుషుడు): నెలవారీ గౌరవ వేతనం రూ.20,000లు
వార్డ్ బాయ్: నెలవారీ గౌరవ వేతనం రూ.20,000లు
పీర్ ఎడ్యుకేటర్: నెలవారీ గౌరవ వేతనం రూ.10,000లు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పోస్టులకు అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ బయోడేటాని, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ , గుంటూరు రాగ్సే, కొలిస్ రెసిడెన్సీ, 7వ లైన్, రాజరాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా 522501 అనే అడ్రస్‌కి పంపించాలి.Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.