RRB NTPC UG అడ్మిట్ కార్డ్ 2025 విడుదల వెంటనే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి
RRB NTPC UG CBT 1 హాల్ టికెట్ 2025 విడుదలైంది. ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
RRB NTPC UG 2025 హాల్ టికెట్ విడుదల, రీజియన్ వారీగా లింకులు, పరీక్ష తేదీలు, పూర్తి వివరాలు (RRB NTPC UG 2025 Hall Ticket Release, Region-wise Links, Exam Dates, Complete Details): RRB NTPC UG 2025 CBT 1 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు ఆగస్టు 4, 2025న అధికారికంగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను https://rrb.digialm.com వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఆగస్టు 7 నుండి సెప్టెంబరు 8, 2025 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడనున్నాయి. CBT 1 పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ అవగాహన – 40 మార్కులు, గణితం– 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 30 మార్కులు ఉంటాయి. పరీక్షా వ్యవధి 90 నిమిషాలు కాగా, ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష కేంద్రానికి హాజరయ్యే సమయంలో హాల్ టికెట్‌తో పాటు ఓ చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లడం తప్పనిసరి. అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి పాటించాలి. పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది.
RRB NTPC UG 2025 CBT 1 అడ్మిట్ కార్డ్ లింకులు జోన్‌వారీగా వెబ్‌సైట్లు(RRB NTPC UG 2025 CBT 1 Admit Card Links Zone-wise Websites)
అభ్యర్థులు తమ RRB జోన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ జోన్‌కు అప్లై చేసారో దానికి అనుగుణంగా కింది లింక్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు.
ప్రాంతం (RRB జోన్ వారీగా ) | అధికారిక వెబ్‌సైట్ లింక్ |
RRB సికింద్రాబాద్ | RRB సికింద్రాబాద్ లింక్ |
RRB ముంబాయి | RRB ముంబాయి లింక్ |
RRB చెన్నై | RRB చెన్నై లింక్ |
RRB కోల్‌కతా | RRB కోల్‌కతా లింక్ |
RRB అహ్మదాబాద్ | RRB అహ్మదాబాద్ లింక్ |
RRB బెంగళూరు | RRB బెంగళూరు లింక్ |
RRB భోపాల్ | RRB భోపాల్ లింక్ |
RRB పాట్నా | RRB పాట్నా లింక్ |
మొత్తం జోన్లకు లింక్ | మొత్తం జోన్లకు లింక్ |
RRB NTPC UG 2025 CBT 1 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download RRB NTPC UG 2025 CBT 1 Admit Card?)
- ప్రతి అభ్యర్థి తన RRB జోన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌కు వెళ్లాలి
- లేదా నేరుగా https://rrb.digialm.com లింక్ ద్వారా జోన్ ఎంపిక చేయవచ్చు
- “Download Admit Card for NTPC UG CBT 1” అనే లింక్‌ను క్లిక్ చేయండి
- మీ RRB Region (ఉదా: Secunderabad, Mumbai, Patna etc.) ఎంపిక చేయండి
- మీ User ID / రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ / పుట్టినతేది నమోదు చేయండి
- Login బటన్‌పై క్లిక్ చేయండి
- హాల్ టికెట్ తెరపై కనిపిస్తుంది.దానిని PDFగా డౌన్‌లోడ్ చేసుకోండి
- పరీక్షకు తీసుకెళ్లేందుకు ప్రింట్‌ఔట్ తీసుకోవాలి
RRB NTPC UG 2025 CBT 1 పరీక్షకు అవసరమైన డాక్యుమెంట్లు(Documents required for RRB NTPC UG 2025 CBT 1 exam)
- RRB NTPC UG 2025 అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్)
- ఆధార్ కార్డ్
- ఓటర్ ID
- పాన్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్
- తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (ఒకటి లేదా రెండు)
RRB NTPC UG 2025 CBT 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష తేదీలకు ముందే అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని, సూచనలను పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.