RRC తూర్పు రైల్వే 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు 2025, ఇప్పుడే అప్లై చేయండి
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ తూర్పు రీజియన్‌లో 3115 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
3115 అప్రెంటిస్ పోస్టులకు RRC తూర్పు రైల్వే నోటిఫికేషన్ 2025 విడుదల, పూర్తి వివరాలు(RRC Eastern Railway Notification 2025 released for 3115 Apprentice posts, full details): రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), తూర్పు రైల్వే, 2025 సంవత్సరానికి సంబంధించి 3115 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు వివిధ డివిజన్లు మరియు వర్క్‌షాపుల్లో ఉన్నాయి, ముఖ్యంగా హౌరా, సీల్దా, ఆసన్‌సోల్, మాల్దా, లిలూయా, కంచ్రాపారా, జమాల్‌పూర్ వర్క్‌షాప్‌లలో. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI కోర్సు పూర్తిచేసి ఉండాలి. అర్హత గల అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది, దానికి మెట్రిక్ మరియు ITIలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14, 2025న ప్రారంభమై సెప్టెంబర్ 13, 2025న ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.100 (UR/OBC/EWS) కాగా, SC/ST/PwBD మరియు మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcer.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమయంలో విద్యా ప్రమాణాలు, ఫోటో, సంతకం వంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయానికి అభ్యర్థుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. వయ్యసు పరిమితిలో రిజర్వ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాలి.
RRC తూర్పు రైల్వే 2025 డివిజన్ వారీగా ఖాళీల వివరాలు(RRC Eastern Railway 2025 Division-wise Vacancy Details)
ఈ క్రింద టేబుల్ పట్టిక ప్రకారం తూర్పు రైల్వే అప్రెంటిస్ పోస్టుల్ని విభిన్న డివిజన్లు మరియు వర్క్‌షాపుల వారీగా కేటాయించారు. అభ్యర్థులు తమ ఆసక్తి ప్రకారం డివిజన్ ఎంపిక చేసుకోవచ్చు.
వర్క్‌షాప్ పేరు | ఖాళీలు |
హౌరా డివిజన్ (Howrah Division) | 659 |
లిలుహ్ వర్క్‌షాప్ (Liluah Workshop) | 612 |
సీల్దా డివిజన్ (Sealdah Division) | 440 |
కాంచ్రపార వర్క్‌షాప్ (Kanchrapara Workshop) | 187 |
మాల్డా డివిజన్ (Malda Division) | 138 |
అసన్సోల్ డివిజన్ (Asansol Division) | 412 |
జమాల్‌పూర్ వర్క్‌షాప్ (Jamalpur Workshop) | 667 |
మొత్తం | 3115 |
RRC తూర్పు రైల్వే 2025 ఆన్‌లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలి ?(How to apply for RRC Eastern Railway 2025 online?)
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcer.org కి వెళ్లాలి
- ఆ తరువాత “Apprentice Recruitment 2025” లింక్‌ను క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించాలి
- వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు) అప్లోడ్ చేయాలి
- అర్హులైతే దరఖాస్తు రుసుము రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి
- దరఖాస్తును సమీక్షించి “Submit” చేయాలి
- ఫైనల్ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి
RRC తూర్పు రైల్వే ద్వారా విడుదలైన ఈ 3115 అప్రెంటిస్ ఖాళీలు ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు గొప్ప అవకాశం. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం, అలాగే ITI అర్హతతో మంచి ఉద్యోగ భద్రత కలిగిన అవకాశమిది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను త్వరగా పూర్తిచేసుకోవాలి. చివరి తేదీకి ముందు అప్లై చేయడం ద్వారా రైల్వేలో ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని వృథా చేయకుండా ఉపయోగించుకోండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.