RRC నార్తర్న్ రైల్వేలో భారీ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ 4,116 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
RRC నార్తర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్‌లు ,వర్క్‌షాప్‌లలో 4,116 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి RRC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 24, 2025లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఖాళీలు (4,116 apprentice vacancies in RRC Northern Railway): న్యూఢిల్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో నార్తర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్‌లు, వర్క్‌షాప్‌లు, యూనిట్‌లలో మొత్తం 4,116 యాక్టు అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయటం ఉంది. రైల్వేలో శిక్షణ పొందే అవకాశం ఈ నియామకాలతో కల్పించబడుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణయించిన గడువులో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థుల విద్యార్హతల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తుకు రూ.100 ఫీజు వర్తిస్తుంది. SC, ST, దివ్యాంగులైన అభ్యర్థులు మరియు మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 24,2025 కాగా, ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా ఫిబ్రవరి 2026లో విడుదల చేయబడుతుంది.
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ దరఖాస్తు అధికారిక నోటిఫికేషన్ లింక్
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ లింక్ ఈ క్రింద పట్టికలో ఉంది
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (RRC Northern Railway Act Apprentice Online Application Procedure)
- ముందుగా నార్తర్న్ రైల్వే అధికారిక RRC వెబ్‌సైట్‌ను సందర్శించాలి
- యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
- కొత్తగా రిజిస్టర్ చేసి లాగిన్ అవ్వాలి
- దరఖాస్తు ఫార్ములో అవసరమైన వివరాలు నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి
- వర్తించే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి
- ఫారం సబ్మిట్ చేసి దాని ప్రతిని భద్రపరచుకోవాలి
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల అర్హతలు (RRC Northern Railway Act Apprentice Posts Qualifications)
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల ఈ నియామకాలకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి:
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి
- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
- వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి
- వయో పరిమితి లెక్కించుకునే తేది డిసెంబర్ 24,.2025
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.
RRC నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల అందుబాటులో ఉన్న ట్రేడ్‌లు (Available Trades for RRC Northern Railway Act Apprentice Posts)
ఈ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌లో వివిధ సాంకేతిక మరియు నాన్‑టెక్నికల్ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వబడుతుంది.
- మెకానికల్
- ఎలక్ట్రిషియన్
- ఫిట్టర్
- కార్పెంటర్
- మోటార్ వెహికిల్ (ఎంవీ)
- ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్
- వెల్డర్
- పెయింటర్
- మెషినిస్ట్
- టర్నర్
- ట్రిమ్మర్
- రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- స్టెనోగ్రాఫర్
నార్తర్న్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ నియామకాలు ఐటీఐ అర్హత గల అభ్యర్థులకు మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసి, అధికారిక నోటిఫికేషన్‌ని జాగ్రత్తగా చదవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
