SBI PO ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విడుదల, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి
SBI PO ఇంటర్వ్యూ (ఫేజ్-III) కోసం కాల్ లెటర్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు నవంబర్ 30 వరకు అధికారిక వెబ్‌సైట్ నుండి తమ కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.SBI PO ఇంటర్వ్యూ (ఫేజ్-III) పూర్తి సమాచారం ఇక్కడ క్రింద చూడండి.
SBI PO 2025 ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ ప్రారంభం (SBI PO 2025 Interview Call Letter Download Starts): SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) రిక్రూట్‌మెంట్‌లో భాగమైన ఫేజ్–III గ్రూప్ ఎక్సర్‌సైజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూలకు సంబంధించి కాల్ లెటర్లు అధికారికంగా విడుదలయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు SBI అధికారిక వెబ్‌సైట్ నుండి కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్ పొందడానికీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పుట్టిన తేదీ మరియు పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలు అవసరం. లింక్ ఓపెన్ కాకపోవడం లేదా డౌన్‌లోడ్‌లో సమస్యలు అంటే కొంతసేపు తర్వాత మళ్లీ ప్రయత్నించమని SBI సూచించింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 541 PO పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి.ఇంటర్వ్యూ దశ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ఎప్పుడు ఫైనల్ అపాయింట్‌మెంట్ పొందగలరో అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిఫరెన్స్ చెక్స్, మెడికల్ పరీక్ష మరియు ఇతర అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఖరారు అవుతుంది. SBI PO పరీక్ష దేశంలో అత్యంత పోటీ ఉన్న బ్యాంకింగ్ పరీక్షలలో ఒకటి, దీని ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తులో నాయకత్వ పాత్రలు నిర్వహించగల ప్రతిభావంతుల్ని ఎంపిక చేయడం దీని ప్రధాన లక్ష్యం.
SBI PO 2025 ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ లింక్ (SBI PO 2025 Interview Call Letter Download Link)
SBI PO 2025 అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SBI PO 2025 ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసే విధానం (How to download SBI PO 2025 interview call letter)
SBI PO 2025 అభ్యర్థులు ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ ఈ క్రింద దశలను పాటించండి.
స్టెప్ 1: ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను సందర్శించండి.
స్టెప్ 2: ఆ తరువాత హోమ్ పేజ్‌లోని Careers విభాగంపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: కొత్త పేజీలో కనిపించే "SBI PO Interview Call Letter 2025" లింక్‌ను గుర్తించండి మరియు క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఒక లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ (dd-mm-yy) మరియు పాస్‌వర్డ్ నమోదు చేయండి.
స్టెప్ 5: సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఇంటర్వ్యూ కాల్ లెటర్ స్క్రీన్‌పై కనబడుతుంది.
స్టెప్ 6: వివరాలు పూర్తిగా చెక్ చేసి, డౌన్‌లోడ్ పై క్లిక్ చేసి ఫైల్ సేవ్ చేసుకోండి.
స్టెప్ 7: భవిష్యత్ అవసరాల కోసం కాల్ లెటర్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోండి.
SBI PO ఇంటర్వ్యూ కాల్ లెటర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. అభ్యర్థులు చివరి తేదీకి ముందు కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని ఇంటర్వ్యూకు సమయానికి హాజరైతే నియామక ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.