ఏ క్షణమైనా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ (SBI PO Prelims Result 2025)
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2025 ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను (SBI PO Prelims Result 2025) ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2025 (SBI PO Prelims Result 2025) :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను 2025 ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను sbi.co.in చెక్ చేసుకోవచ్చు. గత సంవత్సరం ట్రెండ్స్ ప్రకారం SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు సాధారణంగా పరీక్ష తర్వాత 15 రోజుల్లోపు వెల్లడవుతాయి . అందువల్ల 2025 SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు ఈ వారంలో లేదా వచ్చే వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. SBI PO ప్రిలిమ్స్‌తో (SBI PO Prelims Result 2025) పాటు SBI ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు, వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌లను రిలీజ్ చేస్తుంది.
ఫలితాలు విడుదలైన తర్వాత SBI PO ప్రిలిమ్స్‌కి హాజరైన అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్, వారి పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా వారి ఫలితాలను చూసుకోవచ్చు.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను 2025 ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check SBI PO Prelims Result 2025)
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను 2025 ఈ దిగువున చెప్పిన స్టెప్స్‌ని ఫాలో అయి చెక్ చేసుకోవచ్చు.- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను sbi.co.in. సందర్శించాలి.
- హోంపేజీలో 'SBI PO ప్రిలిమ్స్ ఫలితం 2025 ' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ ఫీల్డ్‌లలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, లేదా రోల్ నెంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను రిజిస్టర్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2025 కనిపిస్తాయి.
- భవిష్యత్తు సూచన కోసం ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
SBI PO మార్కింగ్ విధానం 2025 (SBI PO Marking Scheme 2025)
SBI PO ప్రిలిమ్స్ పరీక్షలో మార్కింగ్ విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- తప్పు సమాధానాలకు నా ఆబ్జెక్టివ్ పరీక్షలో ఒక నిర్దిష్ట ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులను తీసివేస్తారు.
- SBI మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టివ్ విభాగానికి నెగటివ్ మార్కింగ్ ఉండదు.
- ఒక ప్రశ్న ఖాళీగా వదిలేస్తే, ఆ ప్రశ్నకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.