SSC CGL టైర్ 1 ఫలితాలు 2025 త్వరలో విడుదల
SSC CGL 2025 టియర్-1 ఫలితాలు నవంబర్‌లో విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. ఫలితాల గురించి పూర్తి సమాచారం క్రింద అందించబడింది.
SSC CGL 2025 ఫలితాలు నవంబర్‌లో (SSC CGL 2025 Results in November): స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన కాంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టియర్-1 పరీక్ష ఫలితాలు నవంబర్‌లో విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో ఈ ఫలితాలు చూడవచ్చు. ఈ సంవత్సరం CGL పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు దేశ వ్యాప్తంగా జరిగాయి. అయితే, ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదం, సాంకేతిక లోపాలు, మరియు కొన్ని షిఫ్ట్‌లలో మోసపూరిత చర్యలు నమోదు కావడంతో SSC అక్టోబర్ 14న రీ-ఎగ్జామ్ నిర్వహించింది. సుమారు 18,000 మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కమిషన్ అభ్యర్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని రీ-ఎగ్జామ్ స్పష్టంగా నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు మళ్లీ నమోదు కాకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు తదుపరి టియర్-2 దశకు సిద్ధం కావాలి.
SSC CGL 2025 ఫలితం ఎలా చూడాలి? (How to check SSC CGL 2025 result?)
SSC CGL 2025 అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in కి వెళ్లండి.
- ఆ తరువాత హోమ్‌పేజ్‌లో "SSC CGL Tier 1 Result 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలు (రిజిస్ట్రేషన్ ID, పాస్ వర్డ్ ) నమోదు చేయండి.
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు కోసం ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
SSC CGL 2025 ఫలితాల తరువాత తదుపరి అంశాలు (Next steps after SSC CGL 2025 results)
SSC CGL 2025 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ క్రింది దశలను పాటించాలి
- టియర్-1లో అర్హత పొందిన వారు టియర్-2 కోసం సిద్ధం కావాలి.
- SSC అధికారిక వెబ్‌సైట్‌లో టియర్-2 షెడ్యూల్ మరియు సిలబస్ ను పరిశీలించండి.
- అవసరమైన పత్రాలు ఏర్పాటు చేసుకోండి (ఫోటో ఐడి, విద్యా ధ్రువపత్రాలు మొదలైనవి).
- మాక్ టెస్టులు మరియు గత సంవత్సరం ప్రశ్నపత్రాలతో ప్రాక్టీస్ చేయండి.
- ఫలితాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి.
SSC CGL 2025 ఫలితాలు నవంబర్‌లో విడుదల అవుతున్నాయి. అభ్యర్థులు ఫలితాలు చూసిన వెంటనే టియర్-2 పరీక్షకు సిద్ధం కాగా, తదుపరి దశలకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.