SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డులను 2025 ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి, ఇదే లింక్
SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డు 2025 (SSC Stenographer Admit Card 2025) విడుదలయ్యాయి. హాల్ టికెట్లను ఈ దిగువున చెప్పిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లింక్‌తో అడ్మిట్ కార్డులను యాక్సెస్ చేయవచ్చు.
SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డు 2025 (SSC Stenographer Admit Card 2025) :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. రిజిస్టర్డ్ అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in నుంచి తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఆగస్టు 6, 7, 8, 2025 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో జరగనుంది. అభ్యర్థులు ప్రవేశానికి పరీక్షా హాలుకు ప్రవేశ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్లాలి. SSC దరఖాస్తుదారులకు పోస్ట్ ద్వారా అడ్మిషన్ కార్డులను పంపదని గమనించాలి. వారు దానిని SSC ఆన్‌లైన్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC స్టెనోగ్రాఫర్ పరీక్షా సరళిని నిర్దేశిస్తుంది. పరీక్షా సరళిని CBT, స్కిల్ టెస్ట్‌గా విభజించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే మూడు విభాగాలు ఉంటాయి. పరీక్షా పత్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు మొత్తం మార్కులు 200. రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష జరుగుతుంది.
SSC స్టెనో గ్రాఫర్ అడ్మిట్ కార్డ్ 2025 లింక్
SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్‌కార్డులను ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC స్టెనో గ్రాఫర్ అడ్మిట్ కార్డ్ 2025ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download SSC Stenographer Admit Card 2025?)
SSC స్టెనో గ్రాఫర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ దిగువున ఇచ్చిన స్టెప్స్‌ని ఫాలో అయి ఈ హాల్ టికెట్లను పొందవచ్చు.
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను ssc.gov.in సందర్శించాలి.
స్టెప్ 2: SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయాలి.
స్టెప్ 4: SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డ్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 5: హాల్ టికెట్ PDFని చూసి, డౌన్‌లోడ్ చేసుకోండి
స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం దీన్ని సురక్షితంగా ఉంచండి
SSC స్టెనోగ్రాఫర్ మార్కింగ్ స్కీమ్ (SSC Stenographer Marking Scheme)
SSC స్టెనోగ్రాఫర్ మార్కింగ్ స్కీమ్ ఈ దిగువున చెప్పిన విధంగా ఉంది.
ప్రతి సరైన సమాధానానికి అభ్యర్థులకు ఒక మార్కు లభిస్తుంది
తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
తప్పు సమాధానాలకు జరిమానా తీసివేసిన తర్వాత సరైన సమాధానాల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల మొత్తం మార్కులను లెక్కిస్తారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.