TG CET 2026 ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
TG CET 2026 ఆన్సర్ కీ త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆన్సర్ కీ, ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
TG CET 2026 పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ సాధారణంగా పరీక్ష జరిగిన మూడు రోజుల్లో విడుదల కావాలి. కానీ ఇంకా విడుదల కాలేదు. అధికారిక ప్రాథమిక కీ ఫిబ్రవరి 26, 2026, ఫిబ్రవరి 27, 28 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత 2 నుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అనంతరం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థులు కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న అనధికారిక కీ ద్వారా మార్కులను చెక్ చేసుకోవచ్చు.
గత మూడేళ్లుగా TG CET ఆన్సర్ కీ 2026 విడుదల తేదీ ట్రెండ్స్
గత మూడేళ్లలో TG CET (Telangana Gurukul Common Entrance Test) పరీక్ష ఆన్సర్ కీ విడుదల తేదీలను గమనిస్తే, ఒక నిర్దిష్టమైన సరళి కనిపిస్తోంది. సాధారణంగా పరీక్ష జరిగిన మూడు రోజుల్లో ఆన్సర్ కీ రిలీజ్ అవుతుంది.
సంవత్సరం | పరీక్షా తేదీలు | ఆన్సర్ కీ తేదీలు |
2025 | ఫిబ్రవరి 23, 2025 | పరీక్ష జరిగిన 3 రోజుల్లో |
2024 | ఫిబ్రవరి 11, 2024 | ఫిబ్రవరి 15 లోపు |
2023 | ఏప్రిల్ 23, 2023 | ఏప్రిల్ చివరి వారం |
ఆన్సర్ కీని ఎక్కడ చూసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక కీ కోసం మీరు ఈ దిగువున తెలిపిన వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.tgcet.cgg.gov.in (ప్రధాన వెబ్‌సైట్)
tgswreis.telangana.gov.in
ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
హోంపేజీలోని డౌన్‌లోడ్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
అభ్యర్థి పేరు లేదా మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- హాల్ టికెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లు, ఇనిస్టిట్యూట్‌లు ఆన్సర్ కీని రిలీజ్ చేశాయి. అయితే అధికారిక ఆన్సర్ కీ కాదు. అనధికారిక ఆన్సర్ కీలు మాత్రమే ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
TG CET 2026 ఆన్సర్ కీ లైవ్ అప్‌డేట్లు
Feb 27, 2026 06:00 PM IST
TG CET ఆన్సర్ కీ వచ్చిన వెంటనే ఏం చేయాలి ?
ఆన్సర్ కీ విడుదలైన వెంటనే చేయాల్సినవి:
- మీ బుక్లెట్ కోడ్ చెక్ చేయండి
- అన్ని సమాధానాలు మ్యాచ్ చేయండి
- సందేహాస్పద ప్రశ్నలను గుర్తించండి
- అవసరమైతే అభ్యంతరం నమోదు చేయండి
- ఫలితాల తేదీపై అప్‌డేట్‌లు ఫాలో అవ్వాలి.
Feb 27, 2026 05:00 PM IST
TG CET ఆన్సర్ కీ విడుదల తర్వాత పూర్తి ప్రక్రియ ఎలా ఉంటుంది ?
- ప్రాధమిక ఆన్సర్ కీ విడుదల
- అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ
- నిపుణల కమిటీ ద్వారా పరిశీలిన
- అవసరమైన సవరణలు
- ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
- ఫలితాల ప్రకటన
Feb 27, 2026 04:00 PM IST
TG CET ఆన్సర్ కీ చూసిన తర్వాత అభ్యర్థి ఏమి చేయాలి ?
- సమాధానాలు సరైనవి → ఫలితాల కోసం వేచి ఉండాలి
- సందేహం ఉంటె → అభ్యంతరం నమోదు చేయాలి
- అభ్యంతరం అంగీకరించబడితే → ఫైనల్ కీలో మార్పు
- మార్పు లేకపోతే → అదే తుది నిర్ణయం
Feb 27, 2026 03:00 PM IST
TG CET ఆన్సర్ కీ విడుదల సమయంలో ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు ?
చేయవలసినవి (Do’s )
- అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే చెక్ చేయాలి
- అభ్యంతరాల గడువును గుర్తించుకోవాలి
- ప్రశ్నల ఆధారాలతో అభ్యంతరం పెట్టాలి.
చేయకూడనివి (Don’ts)
- ఫేక్ లింక్స్ పై క్లిక్ చేయకూడదు
- అనధికారిక కీతో తుది నిర్ణయం తీసుకోకూడదు.
Feb 27, 2026 02:00 PM IST
TG CET లో ప్రశ్న రద్దు చేసే అవకాశం ఉందా ?
అవును. ప్రశ్నలో లోపం ఉన్నట్లు నిర్ధారితమైతే ఆ ప్రశ్నను రద్దు చేసి అందరికి మార్కులు ఇవ్వవచ్చు.
Feb 27, 2026 01:00 PM IST
TG CET 2026 ఒక ప్రశ్నను అట్టెంప్ట్ చేయలేదు . అది నెగటివ్ మార్కింగ్ లో లెక్కిస్తారా ?
అట్టెంప్ట్ చేయని ప్రశ్నకు మార్కులు ఉండవు . కానీ నెగటివ్ కూడా ఉండదు.
Feb 27, 2026 12:00 PM IST
TG CET 2026 ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు సరైనట్లుగా అనిపిస్తే ఏమి చేయాలి ?
TG CET 2026 ప్రాధమిక కీ విడుదలైన వెంటనే అభ్యంతరం నమోదు చేయాలి. సరైన అధరాలు జతచేస్తే కమిటీ పరిశీలిస్తుంది.
Feb 27, 2026 11:00 AM IST
TG CET 2026 “ఆన్సర్ కీ తప్పు ఉంటె బోర్డు సరిదిద్దుతుందా ? “
అవును. అభ్యంతరాల ద్వారా వచ్చిన సరైన అంశాలను కమిటి సవరిస్తుంది.
Feb 27, 2026 10:00 AM IST
TG CET 2026 ఆన్సర్ కీకి ఫీజు కట్టలా ?
కొన్ని సందర్భాల్లో అభ్యంతరం నమోదు చేయడానికి స్వల్ప ఫీజు ఉండొచ్చు. TG CET వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో తెలియజేస్తారు.
Feb 27, 2026 09:00 AM IST
TG CET 2026 అభ్యంతరాల తర్వాత ఫలితాలు ఎన్ని రోజుల్లో వస్తాయి ?
TG CET 2026 అభ్యంతరాల తర్వాత సాధారణంగా 7 – 10 రోజుల్లో ఫైనల్ కీ + ఫలితాలు విడుదల అవుతాయి.
Feb 27, 2026 08:00 AM IST
TG CET 2026 ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఎంత టైం లో అభ్యంతరాల అవకాశం ఉంటుంది ?
TG CET 2026 ఆన్సర్ కీ విడుదలైన తర్వాత సాధారణంగా 2 నుంచి 3 రోజులు మాత్రమే.
Feb 27, 2026 07:00 AM IST
TG CET 2026 “అనధికారిక కీ లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఇవే ఫైనల్ అవుతాయా ?”
కచ్చితంగా కాదు. అనధికారిక కీలు కేవలం అంచనా మాత్రమే. అధికారిక ఫైనల్ కీ ఆధారంగానే ఫలితాలు నిర్ణయిస్తారు.
Feb 27, 2026 06:00 AM IST
TG CET 2026 ఆన్సర్ కీకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఎక్కడ లభిస్తాయి ?
TG CET 2026 ఆన్సర్ కీ విడుదల తేదీ, అభ్యంతరాల లింక్, ఫైనల్ కీ ఫలితాల సమాచారం వంటి అన్ని కీలక అప్‌డేట్స్ ఈ క్రింది Collegedekho LIVE BLOG ద్వారా వెంట వెంటనే అందించబడతాయి.
Feb 26, 2026 08:00 PM IST
TG CET 2026 అధికారిక ఆన్సర్ కీని ఎక్కడ చెక్ చేయాలి ?
అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా గమనించాలి.
- tgcet.cgg.gov.in
- tgswreis.telangana.gov.in
Feb 26, 2026 07:00 PM IST
గత మూడేళ్ళ ట్రెండ్ చూస్తే ఈసారి ఆలస్యం సాధారణమేనా ?
గత మూడేళ్ళ ట్రెండ్ ప్రకారం పరీక్ష జరిగిన 3 - 5 రోజుల్లో ఆన్సర్ కీ విదలైంది. ఈ సారి స్వల్ప ఆలస్యం ఉన్నప్పటికీ, ఫిబ్రవరి చివరి నాటికి కీ విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
Feb 26, 2026 06:00 PM IST
TG CET 2026 ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి ?
ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైన తర్వాత 2 నుంచి 3 రోజులు అభ్యంతరాలు (Objections) స్వీకరిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ప్రశ్న సంఖ్య సరైన సమాధానికి ఆధారాలతో అభ్యంతరం నమోదు చేయాలి.
Feb 26, 2026 05:00 PM IST
TG CET 2026 ప్రాథమిక ఆన్సర్ కీ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది ?
ప్రస్తుత సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26,27,లేదా 28, 2026 అధికారిక ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
Feb 26, 2026 04:00 PM IST
నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు ?
కాకుత్సం శేషప్పకవి
Feb 26, 2026 03:00 PM IST
“ కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు” పద్యాన్ని రచించిన కవి ఎవరు ?
వేమన
Feb 26, 2026 02:00 PM IST
మట్టిలో తొందరగా కలిసిపోని వస్తువులు ఏవి ?
కాగితం
Feb 26, 2026 01:30 PM IST
క్షేత్రం పదానికి అర్ధం ఏమిటి ?
భూమి
Feb 26, 2026 01:00 PM IST
వినాయకుని పండగను ఏ మాసంలో జరుపుకుంటురు ?
భాద్రపదం
Feb 26, 2026 12:00 PM IST
పనిని గురించి తెలిపే భాషాభాగం ఏది?
క్రియ
Feb 26, 2026 11:30 AM IST
పోచంపాడు దగ్గర కట్టబడిన ఆనకట్ట పేరేమిటీ?
శ్రీరాం, సాగర్ ప్రాజెక్ట్
Feb 26, 2026 11:00 AM IST
భూమీశులు సమాన అర్థం వచ్చే పదాలను గుర్తించండి
రాజు, రైతు
Feb 26, 2026 10:30 AM IST
పర్యావరణాన్ని పాడుచేసే వస్తవులు ఏవి?
ప్లాస్టిక్
Feb 26, 2026 10:00 AM IST
పరమానందయ్య శిష్యుల కథ ఏ రసానికి చెందినది?
హాస్యం
Feb 26, 2026 09:30 AM IST
హేమం అనే పదానికి అర్థం వచ్చే ఇతర పదాలను గుర్తించండి
బంగారం, ఇత్తడి
Feb 26, 2026 09:00 AM IST
కమల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది
వర్తమాన కాలం