TG EAPCET మాక్ కేటాయింపు 2025 అంచనా విడుదల సమయం
TG EAPCET 2025 మాక్ సీటు కేటాయింపు జాబితా విడుదలైంది. ఇది అభ్యర్థులకు తాము ఎంచుకున్న వెబ్ ఆప్షన్‌ల ఆధారంగా ఏ సీటు వచ్చే అవకాశముందో ముందుగా అంచనా వేసేలా సహాయపడుతుంది.
TG EAPCET 2025 మాక్ సీట్ కేటాయింపు, విడుదల సమయం ఎప్పుడంటే?(When is the TG EAPCET 2025 mock seat allocation and release date?):
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తున్న TG EAPCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మాక్ సీట్ కేటాయింపు (Mock Allotment) జాబితా విడుదలైంది..
అభ్యర్థులు జూలై 12, 2025 న ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ద్వారా చూసుకోవచ్చు. అయితే కచ్చితమైన సమయం అధికారికంగా ప్రకటించబడలేదు కానీ, గత అనుభవాలను బట్టి మాక్ సీటు అలాట్‌మెంట్ సాధారణంగా మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి:
TG EAPCET మాక్ అలాట్‌మెంట్ 2025 లిస్ట్ వచ్చేసింది, డౌన్‌లోడ్ లింక్
అభ్యర్థులు జూలై 6 నుండి 10 వరకు TG EAPCET వెబ్ ఆప్షన్ ఎంట్రీని పూర్తి చేశారు. ఆప్షన్లను ఫ్రీజ్ చేయడానికి చివరి తేదీ జూలై 10 కాగా, మాక్ ఫలితాలు జూలై 13న ప్రకటించనున్నారు. ఇది తాత్కాలిక కేటాయింపు మాత్రమే. ఈ కేటాయింపులు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి, వారు పొందే అవకాశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో విడుదల చేస్తారు.
మాక్ ఫలితాల తరువాత, జూలై 14 నుండి 15 తేదీలలో అభ్యర్థులకు ఆప్షన్లను సవరించుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్యతల్ని బట్టి ఆప్షన్లను తిరిగి అంచనా వేయవచ్చు .ఈ దశ అనంతరం జూలై 15 న ఫైనల్ ఆప్షన్లను ఫ్రీజ్ చేయాలి. తర్వాత జూలై 18న ప్రొవిజనల్ సీట్ కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
TG EAPCET 2025 కౌన్సెలింగ్‌కి అవసరమైన డాక్యుమెంట్లు వివరాలు
- TG EAPCET 2025 ర్యాంక్ కార్డ్
- హాల్ టికెట్
- ఆధార్ కార్డు (Aadhaar Card)
- 10వ తరగతి & ఇంటర్ మార్కుల మెమోలు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) (అవసరమైతే మాత్రమే)
- కులధ్రువీకరణ పత్రం (Caste Certificate) (ఒబిసి/ఎస్సీ/ఎస్టీకి మాత్రమే)
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
-
నివాస ధ్రువీకరణ పత్రం / స్థానికత పత్రం (Residence/Nativity Proof)
TG EAPCET 2025 కౌన్సెలింగ్ దశలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయి. అభ్యర్థులు సంబంధిత తేదీలకు అనుగుణంగా ప్రతి దశను పూర్తి చేయాలి. మాక్ అలాట్‌మెంట్ ఫలితాల విడుదల తర్వాత అవసరమైతే తమ వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో ఏ తప్పూ జరుగకుండా ఉండాలంటే, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.